https://oktelugu.com/

Viral Video: రీల్స్ పేరుతో రైల్వే ప్లాట్ ఫామ్ పై పిచ్చిచేష్టలు చేస్తున్న యువతిని చితకొట్టిన మహిళ.. వైరల్ వీడియో..

Viral Video: తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియొ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఒక యువతి రైల్వే ప్లాట్ ఫామ్ మీద ఎక్కడ నుంచి వచ్చిందో కానీ కుప్పిగంతులు వేసుకుంటూ వచ్చింది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 10, 2024 / 06:04 PM IST

    woman beat the girl by seeing her weird dancing in Railway station

    Follow us on

    Viral Video: సోషల్ మీడియా లో ఫేమస్ అవ్వడానికి చాలా మంది పడరాని పాట్లు పడుతున్నారు.ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తూ పిచ్చిచేష్టలు వేస్తున్నారు.వారి చుట్టూ ఉన్న వారికి వీరి ప్రవర్తన ఇబ్బంది పెట్టకపోతే బానే ఉంటుంది.కానీ కొన్ని సందర్భాలలో ఇలాంటివి బెడిసికొడుతూ ఉంటాయి.అందరిని నవ్వించటానికి ప్రయత్నించి చాలా మంది చిక్కుల్లో పడుతూ ఉంటారు.

    తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియొ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఒక యువతి రైల్వే ప్లాట్ ఫామ్ మీద ఎక్కడ నుంచి వచ్చిందో కానీ కుప్పిగంతులు వేసుకుంటూ వచ్చింది.చూసుకోకుండా ఆమె ఒక మహిళ పై పడింది.కింద పడిన యువతి లేచి ఆ మహిళ కు సారీ చెప్తే సరిపోయేది కానీ ఆమె లేవకుండా నెల పైనే పిచ్చిగా డాన్స్ మూమెంట్స్ చేసింది.దాంతో ఒళ్ళు మండిన ఆ మహిళ ఆ యువతిని చితకొట్టింది.

    ఆ యువతి మాత్రం తనకేమి పట్టనట్టు డాన్స్ చేస్తూనే ఉంది.చుట్టూ ఉన్న వాళ్ళు ఇదంతా గమనించి ఆమె నిజంగానే డాన్స్ చేస్తుందా లేదా డ్రగ్స్ ఏమైనా తీసుకుందా అనే సందేహం తో ఆమెకు దూరంగా జరిగారు.వైరల్ అవుతున్న ఈ వీడియొ ను చూసిన నెటిజన్లు ఆమె సీమ అని కనిపెట్టేసారు.ఆమె తరచూ ఇలా ముంబై రైల్వే స్టేషన్ లో రీల్స్ చేస్తూ ఉంటుందట.ఇలా బహిరంగ ప్రదేశాలలో హాస్యాస్పదంగా రీల్స్ చేసి ఫేమస్ అవ్వడం ఆమె ధ్యేయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    ఇప్పటికే ఆమె ఇలాంటి ఎన్నో వీడియొ లను తన ఇంస్టాగ్రామ్ ఖాతా అయినా @seemakanojiya87 అనే యూసర్ ఐడి లో షేర్ చేసింది.అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.రీల్స్ చేసి ఫేమస్ అవ్వడం కోసం రైల్వే ప్లాట్ ఫామ్ మీద ఇంత దారుణంగా డాన్స్ చేయడం అవసరమా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.