Viral Video : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఎక్కువగా వాడుతున్నారు. లేచినప్పటి నుంచి నిద్రపోయేంతవరకు ప్రతి పని కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. ఇలా చేసిన ప్రతి పనిని కూడా సోషల్ మీడియాలో పంచుకుంటుంటే.. వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలా పాపులర్ కావడంతో మంచి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఎక్కువగా రీల్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. దీని ద్వారా చాలామంది పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది. ఈ షోకి వెళ్లాలని ఎంతమంది కలలు కంటుంటారు. యూట్యూబ్ లేదా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా పాపులారిటీని సంపాదించుకొని ఈ షో కి వెళ్తుంటారు. అయితే అందరూ పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లు మాత్రమే కాకుండా.. కొంతమంది వాళ్ల పాపులాయిటీని ఇంకా పెంచుకోవడానికి కూడా ఈ షో కి వెళ్తుంటారు. అయితే ఓ యువకుడు బర్రెలు కాస్తూ చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బర్రెలు కాసేవాళ్లు బిగ్ బాస్ షో కి వెళ్లకూడదా.? అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అతను ఆ వీడియోలో బర్రెలు కాసే వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడతారో, తన కష్టాలను చెబుతాడు. అయితే దీనికి నెటిజన్లు బిగ్ బాస్ కి నువ్వు ఒక్కడివే వెళ్తావా ఆ బర్రెలను తీసుకెళ్లవా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ యువకుడు వీడియోలో ఏం మాట్లాడడో చూద్దాం.
పాలమూరుకు చెందిన యువకుడు పాల రైతు గురించి రీల్ చేసాడు. పాల రైతు ఎంత కష్టపడుతున్న వీడియో లో స్పష్టంగా తెలిపాడు. ఒక పాలు అయితే పొద్దున్న ఐదు గంటలకు లేచి.. వాటికి దాన వేసి, శుభ్రం చేసి, పాలు పితికి వాటిని అమ్మడానికి తీసుకువెళ్తే.. సరిగ్గా డబ్బులు ఇవ్వరు అని అన్నాడు. డబ్బులు తీసుకున్న తర్వాత మళ్లీ వాటిని సాయంత్రం పచ్చగడ్డి తినిపించి, ఇంటికి తీసుకొచ్చే సరికి.. రాత్రి ఏడు లేదా ఎనిమిది గంటలు అవుతుందని ఆ యువకుడు తెలిపాడు. ఇంత కష్టపడి రోజంతా పనిచేస్తుంటాం. కానీ చాలామంది ఏం పని లేకపోతే నీకేం పని లేదు కదా బర్రెలు కాసుకోరా అని అంటుంటారని ఆ యువకుడు బాధపడ్డాడు. ఈ వీడియోలో పైన బిగ్ బాస్ లోగో వేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. నువ్వు ఒక్కడే బిగ్ బాస్ కి వెళ్తే మరి ఆ బర్రెలు ఏమైపోతాయి. లేకపోతే నువ్వు ఒక్కడివే బిగ్ బాస్ షో కి వెళ్తావా లేకపోతే ఆ బర్రెలను కూడా తీసుకెళ్తావా.. అన్ని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
&