https://oktelugu.com/

Viral Video : ఆపిల్ మ్యాక్ బుక్ లో వివాహ ఆహ్వాన పత్రిక.. తెరిచి చూస్తే మామూలు అద్భుతం కాదు.. వీడియో వైరల్

భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహ సమయంలో ఆహ్వాన పత్రిక ఇవ్వడం సర్వసాధారణం. ఆర్థిక స్తోమత ఆధారంగా వివాహ ఆహ్వాన పత్రికలను రూపొందించడం.. ఆ తర్వాత బంధుమిత్రులకు అందించడం ఎప్పటినుంచో ఉంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 21, 2024 / 09:24 PM IST

    Apple MacBook Wedding invitation card,

    Follow us on

    Viral Video :  తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ జంట తమ వివాహ ఆహ్వాన పత్రికలో అత్యంత వైవిధ్యాన్ని చూపించింది. ఇంతకీ అందులో ఏముందంటే.. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి ప్రాంతానికి చెందిన డీఎస్పీ మనోజ్ కుమార్ కు ఇటీవల వివాహం నిశ్చయమైంది.. వివాహ తేదీ రానే వచ్చింది. ఈ నేపథ్యంలో తన వివాహానికి బంధువులను ఆహ్వానిస్తూ ఒక పత్రికను ఆయన రూపొందించారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. ఈ పత్రిక అత్యంత వినూత్నంగా ఉంది. పత్రికపై ఆపిల్ సింబల్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. అది అచ్చం ఆపిల్ మ్యాక్ బుక్ లాగా దర్శనమిస్తోంది. దానిని తెరిచి చూస్తే గూగుల్ స్క్రీన్ కనిపిస్తోంది. మరోవైపు కీబోర్డు తరహాలో ఓ చిత్రం ఉంది.. మనోజ్ తనకు కాబోయే భార్య చారునితో జరిగే పెళ్లికి సంబంధించిన విషయాన్ని గూగుల్ లో శోధించినట్టు చూపించారు.. దాని కింద ముహూర్త సమయం, కళ్యాణ వేదిక, ఆ వేదికను చూపించే గూగుల్ లొకేషన్.. ఇతర వివరాలు రూపొందించారు..

    ఆశ్చర్యానికి గురవుతున్నారు..

    ఆ పెళ్లి పత్రికను చూసిన పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. ” వినూత్నత అంటే ఇదే.. చాలా గొప్పగా ఉంది. వచ్చిన ఆలోచన విచిత్రంగా ఉంది. చూస్తుంటే టెక్నాలజీ కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఈ తరహాలో వివాహ పత్రికను చూడలేదు. టెక్నాలజీని అనువుగా వాడుకున్నారు. గూగుల్ ను ఇలా కూడా వాడొచ్చని నిరూపించారు. గూగుల్ ద్వారా అన్ని విషయాలను ప్రస్తావించారు. చూస్తుంటే చాలా విచిత్రంగా ఈ కార్డు కనిపిస్తోంది. కచ్చితంగా బంధువులు ఈ వివాహానికి హాజరవుతారు. ఎందుకంటే ఆ వివాహ ఆహ్వాన పత్రిక అత్యంత వినూత్నంగా ఉంది. పొరపాటున చూస్తే అది నిజమైన ఆపిల్ మ్యాక్ బుక్ లాగా కనిపిస్తోందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ వీడియోను ఇన్ స్టా లో లక్షల మంది చూశారు. అంతే సంఖ్యలో లైక్ చేశారు.

    ఐటీ విభాగంలో పనిచేశాడట..

    కాగా, మనోజ్ కుమార్ గతంలో ఐటి విభాగంలో పనిచేశాడు. అతడికి కాబోయే సతీమణి కూడా ఆ విభాగంలో పనిచేస్తున్నారు. అందువల్లే వివాహ ఆహ్వాన పత్రికను ఆధునికత పుట్టిపడేలా రూపొందించారు. పైగా గూగుల్, సెర్చింగ్, లోకేషన్ వంటి టూల్స్ ఉపయోగించారు కార్డును కూడా నేటి కాలానికి అనుగుణంగా ముద్రించారు. ప్యాకింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఈ కార్డును చూసిన తర్వాత చాలామంది తమ పెళ్ళికి ఇలానే ఆహ్వాన పత్రికలను ప్రింట్ చేయాలని భావిస్తున్నట్టు కామెంట్స్ ద్వారా తెలియజేశారు. ఆపిల్ కంపెనీ మ్యాక్ బుక్ పోలిన రంగు..ఆపిల్ కంపెనీ సింబల్ వివాహ ఆహ్వాన పత్రికకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చాయి.