Viral Video : జంతువులలో కుక్కలు విశ్వాసానికి ప్రతీకలుగా ఉంటే.. ఎద్దులు బండెడు చాకిరి చేసే శ్రమజీవులుగా పేరుపొందాయి. ఆదిమానవుల కాలం నుంచి ఇప్పటివరకు మనుషులు చేస్తున్న వ్యవసాయంలో ఎద్దులు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఎద్దులు బరువులను విపరీతంగా లాగుతుంటాయి. నాగలి దున్నడంలో.. గొర్రు తోలడంలో.. భూమిని చదును చేయడంలో తమ శక్తిని యుక్తిని ధారపోస్తుంటాయి. అందువల్లే ఎద్దులు పురాతన కాలం నుంచి ఇప్పటివరకు మనిషికి అత్యంత నమ్మకమైన జంతువులుగా పేరుపొందాయి. ఇక ఆవులు.. గేదెలు మనిషికి కావలసిన పాలను అందిస్తున్నాయి. ఈ పాల ద్వారా పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి వంటివి తయారవుతుంటాయి. మొత్తంగా కుక్కలు మాత్రమే కాకుండా ఎద్దులు, ఆవులు, గేదెలతో కూడా మనుషులకు అవినాభావ సంబంధం ఉంది.. అందుకే ఇవి మనుషులను చూడగానే దగ్గరికి వస్తుంటాయి. ప్రేమతో ఆప్యాయతను కనబరుచుతుంటాయి.
తప్ప తాగిన యజమానిని..
ఎద్దులు బండెడు చాకిరి మాత్రమే కాకుండా.. యజమానిపై అపరిమితమైన ప్రేమను, విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంటాయి. ఎద్దుల్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ.. అన్ని కూడా మనుషులకు అత్యంత ప్రీతిపాత్రంగానే ఉంటున్నాయి. బ్రెజిల్ దేశంలో ఓ వ్యక్తి భారీగా వ్యవసాయం చేస్తుంటాడు. అతడికి విపరీతమైన యంత్ర సామాగ్రి ఉన్నప్పటికీ.. ఎద్దులను పెంచడం అతడికి విపరీతమైన ఇష్టం. అయితే ఇటీవల అతడు పీకలదాకా మద్యం తాగాడు. ఆ తాగిన మత్తులో నడిరోడ్డు మీద పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. పైగా అతడికి ఫోన్ చేస్తే రింగ్ అవుతున్నప్పటికీ.. ఎత్తే పరిస్థితిలో లేడు. దీంతో యజమానిని వెతుక్కుంటూ వెళ్లిన ఎద్దు.. చివరికి అతడి జాడను కనిపెట్టింది. రోడ్డుపై పడిపోయిన అతడిని తన నాలుకతో శరీరం మొత్తం నాకి లేచే విధంగా చేసింది. ఆ తర్వాత అతడిని వెనకనుంచి తన తలతో తోసుకుంటూ ఇంటిదాకా తీసుకువచ్చింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. అయితే ఇది చాలా రోజుల క్రితమే జరిగినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
అయితే ఇదంతా కల్పితమని.. సోషల్ మీడియాలో ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంత తప్ప తగిన వ్యక్తి తనను వీడియో తీస్తున్న వ్యక్తులకు అభివాదం ఎలా చేస్తాడని.. ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేసిన డ్రామా అని కొంతమంది నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. అతడు ఆ స్థాయిలో మద్యం తాగితే.. ఎద్దు వెనకాల ఉండాలి గాని.. తన ఇంటి దారిలోనే సక్రమంగా వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ ఎద్దు చేసిన నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో అతడిని ఓవర్ నైట్ స్టారును చేసేసింది.
View this post on Instagram