Viral Video : ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మేటి సంస్థల్లో సింహభాగం జపాన్ దేశానికి చెందినవే. స్మార్ట్ ఫోన్ ల నుంచి మొదలు పెడితే.. కెమెరాల వరకు జపాన్ దేశానికి చెందిన కంపెనీలే ఉన్నాయి. ఈ కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. పైగా తమ ఉత్పత్తులను మరింత విస్తరించడానికి జపాన్ కంపెనీలు ఆయా దేశాలలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. తమ కార్యకలాపాలను విస్తృతంగా కొనసాగిస్తున్నాయి.. స్థానికంగా ఉపాధిని కల్పించడంతోపాటు.. భారీగా ఆదాయాన్ని వెనకేసుకుంటున్నాయి. జపాన్ తయారు చేసే ఉత్పత్తులు అత్యంత నాణ్యంగా ఉంటాయి కాబట్టి.. వాటికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. టెక్నాలజీ ఆధారంగానే జపాన్ మనుగడ కొనసాగిస్తోంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి మొదలుపెడితే రాత్రి పడుకునే వరకు ప్రతి అంశాన్ని కూడా టెక్నాలజీతో అనుసంధానం చేసి.. సరికొత్త జీవన అనుభవాన్ని జపాన్ కల్పిస్తోంది. అందువల్లే జపాన్ టెక్నాలజీకి.. జపాన్ కంపెనీలు తయారుచేసిన ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
Also Read :మిరాయ్’ కి పోటీగా ‘విశ్వంభర’..? తేజ సజ్జ వెనక్కి తగ్గుతాడా?
దైనందిన జీవితంలో చేసే పనులకు కూడా టెక్నాలజీని జోడించిన ఘనత జపాన్ దేశానికి దక్కుతుంది. అందువల్లే జపాన్ దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా భిన్నంగా చూస్తుంటారు. అయితే ఒక పరిమితి వరకే ఆగిపోక.. అనేక ప్రయోగాలు చేస్తూ జపాన్ శాస్త్రవేత్తలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు చేసిన ఓ ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఇంతకీ జపాన్ శాస్త్రవేత్తలు చేసిన ఆ ప్రయోగం ఏంటంటే..
జపాన్ దేశంలో ఆరుబయట బాత్రూంలు ఉంటాయి. రద్దీగా ఉండే ప్రాంతాలలో స్నానం చేయడానికి.. మూత్ర విసర్జనకు.. కాళ్ల కృత్యాలు తీర్చుకోవడానికి వీటిలో ఏర్పాట్లు ఉంటాయి. సాధారణంగా అయితే ఇటువంటి వాటిని టెంపరరీగా ఏర్పాటు చేస్తుంటారు. అయితే జపాన్ ఎందుకు పూర్తి విభిన్నం కాబట్టి.. బాత్రూంల విషయంలోనూ టెక్నాలజీని జోడించింది. వాటికి ట్రాన్స్పరెంట్ బాత్రూంలు అని పేరు పెట్టింది. బాత్రూంలలో పైకి చూస్తే అంత ఓపెన్ గానే కనిపిస్తుంది. పైగా వాటిని అత్యంత అందమైన గ్లాస్ తో నిర్మించారు. ఒకసారి అందులోకి వెళ్తే మొత్తం ముగుసుకుపోతుంది. బయట నుంచి చూస్తే ఏమి కనిపించదు. దీంతో అందులోకి వెళ్లినవారు స్నానం చేయొచ్చు. మూత్ర విసర్జన చేయొచ్చు. కాళ్ల కృత్యాలు కూడా తీర్చుకోవచ్చు. అయితే ట్రాన్స్పరెంట్ బాత్రూంలను ఉపయోగించుకున్నందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా ఈ వ్యర్ధాలు మొత్తం వెంట వెంటనే క్లీన్ అయిపోతుంటాయి. వాటి ద్వారా ఎరువు తయారుచేసి పంటలకు వేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యర్ధాలను బహిరంగంగా పడేయరు.. అయితే బాత్రూంలు వినియోగించుకున్నప్పుడు.. కచ్చితంగా వాటర్ ఫ్లష్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు అందులో ఎటువంటి వ్యర్ధాలు వేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఏమైనా వ్యర్ధాలు వేస్తే అపరాధ రుసుము విధిస్తారు. ఎందుకంటే ఈ బాత్రూంల నిర్వహణ లో జపాన్ అత్యంత ఖచ్చితత్వాన్ని పాటిస్తోంది. పూర్తిగా టెక్నాలజీని వీటికి అనుసంధానించింది. అందువల్లే ఇవి ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. అన్నట్టు ప్రస్తుతం టోక్యో.. కొన్ని కొన్ని ప్రధాన నగరాలలో మాత్రమే ట్రాన్స్పరెంట్ బాత్రూంలు ఉన్నాయి. భవిష్యత్తు కాలంలో వీటిని దేశం మొత్తం విస్తరించాలని అక్కడి పాలకులు భావిస్తున్నారు. మొత్తం గా టెక్నాలజీని బాత్రూంలకు అనుసంధానించి.. విజయవంతంగా అమలు చేస్తున్న ఘనతను జపాన్ దక్కించుకుంది.
జపాన్ లో transparent బాత్ రూమ్స్
బాత్ రూం లోకి వెళ్లగానే బయట నుంచి ఏమి కనపడదు pic.twitter.com/A54LelUTSI— Kumar Reddy.Avula (@Kumar991957) May 20, 2025