https://oktelugu.com/

David Warner: హోస్ట్ ను ఎత్తుకొని ఉచిత ఆధార్ కోసం పరుగులు తీస్తున్న వార్నర్…వైరల్ వీడియో…

ఆయన తెలుగు సినిమాల రీల్స్, షాట్స్ తో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక తెలుగు నుంచి వచ్చిన ప్రతి సినిమా డైలాగులను షాట్స్, రీల్స్ చేసి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : April 24, 2024 / 01:46 PM IST

    David Warner hilariously runs to get free Aadhar Card

    Follow us on

    David Warner: ఆస్ట్రేలియన్ ఓపెనర్ ప్లేయర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డేవిడ్ వార్నర్ ప్రస్తుతం ఐపిఎల్ లో ఢిల్లీ టీం తరఫున తన సేవలను అందిస్తున్నాడు. ఇక ఇంతకు ముందు హైదరాబాద్ టీం సారధిగా వ్యవహరించిన ఈయన 2016 వ సంవత్సరంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి ఐపీఎల్ కప్పుని కూడా అందించాడు. ఇక అక్కడ ఆయనకి సరైన గుర్తింపు రాకపోవడంతో తను ఆ టీం నుంచి బయటికి వచ్చేసి ఢిల్లీ టీమ్ లో ఆడుతున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ఆయన తెలుగు సినిమాల రీల్స్, షాట్స్ తో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక తెలుగు నుంచి వచ్చిన ప్రతి సినిమా డైలాగులను షాట్స్, రీల్స్ చేసి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక అందుకే అతన్ని తెలుగు ప్రేక్షకులు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో హోస్ట్ తో మాట్లాడిన వార్నర్ సినిమా కెల్దమా అంటే నేను రాను అని చెప్పాడు, భోజనం చేద్దామా అన్న కూడా రాను అని సమాధానం చెప్పాడు.

    అక్కడ ఉచిత ఆధార్ ఇస్తున్నారు అని చెప్పడంతో పద పద పద అంటూ హోస్ట్ ని ఎత్తుకొని మరి దానికోసం పరిగెత్తాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక మన దేశం అన్నా ఇక్కడి సంస్కృతిలు అన్నా ఆయనకి చాలా ఇష్టం.. అందుకే తనకి ఆస్ట్రేలియా తర్వాత ఇష్టమైన దేశం ఇండియా అని చెప్తూ ఉంటాడు. అందుకే ఇండియాకు సంబంధించిన ప్రతి విషయంలో ఏదో ఒక రకంగా తన కృతజ్ఞతలు చాటుకుంటూ ఉంటాడు.

    ఇక ప్రస్తుతం ఢిల్లీ టీం తరఫున ఆడుతున్న ఈయన మ్యాచ్ లో మంచి పర్ఫామెన్స్ ని ఇస్తూ వస్తున్నప్పటికీ ఆ టీం మాత్రం పెద్దగా విజయాలు అయితే సాధించడం లేదు. ప్రస్తుతం గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటున్న వార్నర్ ఈరోజు ఢిల్లీ గుజరాత్ తో ఆడే మ్యాచ్ లో అందుబాటులో ఉండటం లేదు…