Viral Video : ఇదే సమయంలో ముంబై జట్టు సారథి హార్దిక్ పాండ్యా బుమ్రా కు బంతిని అందించాడు. స్ట్రైకర్ గా 48 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. మరో ఎండ్ లో సాయి సుదర్శన్ ఉన్నాడు. బుమ్రా బౌలింగ్ ను వాషింగ్టన్ సుందర ఎదుర్కొంటాడు.. ధైర్యంగా పరుగులు చేస్తాడు.. గుజరాత్ జట్టును గెలుపు తీరాల వైపు తీసుకెళ్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇదే సమయంలో అద్భుతం చోటుచేసుకుంది. పాండ్యా కోరుకుంటున్నది.. ముంబై జట్టు జరగాలని భావిస్తున్నది.. మొత్తంగా జరిగిపోయింది. చివరికి గుజరాత్ జట్టు గుండె పలిగింది. ఊహించని విజయం ముంబై జట్టు సొంతమైంది.
అప్పటికి బలమైన భాగస్వామ్యంతో వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ జోడి తమ ప్రయాణం సాగిస్తే గుజరాత్ కథ మరో విధంగా ఉండేది. కానీ వాషింగ్టన్ సుందర్ బుమ్రా వేసిన బంతిని ఎదురుకోలేకపోయాడు. క్లీన్ బౌల్డ్.. అతడు అవుట్అడమే కాకుండా.. జట్టును కూడా విజయానికి దూరం చేశాడు. వాస్తవానికి బుమ్రా అద్భుతమైన యార్కర్లు వేస్తాడు. ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం లేకుండా చూస్తాడు. అందువల్లే టీమిండియా స్పీడ్ గన్ గా బుమ్రాను పేర్కొంటుంటారు.
అయితే అంతటి బుమ్రా ఆదివారం నాటి మ్యాచ్లో వికెట్లు తీయలేకపోయాడు. పైగా పరుగులు ధారళంగా ఇచ్చాడు. వాస్తవానికి అతడు ఇలా బౌలింగ్ వేస్తాడని ముంబై మేనేజ్మెంట్ కలలో కూడా ఊహించి ఉండదు. ముంబై జట్టు సారధి హార్దిక్ కూడా కలగని ఉండడు. ముఖ్యంగా జోస్ ఇంగ్లిస్ బుమ్రా బౌలింగ్లో పరుగుల వరద పారించగా.. దానిని అయ్యర్ కొనసాగించాడు. ముఖ్యంగా అయ్యర్ వికెట్ పడగొట్టడానికి బుమ్రా పదేపదే యార్కర్లు వేశాడు. కానీ అయ్యర్ మాత్రం అత్యంత తెలివిగా బ్యాటింగ్ చేశాడు. వికెట్లను లక్ష్యంగా చేసుకొని బుమ్రా బాల్స్ వేస్తుంటే.. బ్యాట్ ను ఆఫ్ సైడ్ వైపు తిప్పి పరుగులు వచ్చేలా చేశాడు. బుమ్రా వేసిన బంతులను ఇదే విధంగా అయ్యర్ ఆకట్టుకున్నాడు. అదే కాదు బుమ్రా ఏకాగ్రతను దెబ్బతీసి.. ముంబై జట్టుకు చుక్కలు చూపించాడు. బుమ్రా బౌలింగ్ లో ఇంగ్లిస్ వీర విహారం చేస్తే.. అయ్యర్ అంతకుమించి అనే రేంజ్ లో రెచ్చిపోయాడు. ముఖ్యంగా పదునైన బంతులను బౌండరీల వైపు తరలించి అదరగొట్టాడు. ” అయ్యర్ లో ఈ స్థాయి పరిపక్వతను చూసి గొప్పగా అనిపిస్తోంది. అతడు అలా ఆడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజంగా అయ్యర్ ఇలా మారిపోయాడంటే నమ్మశక్యం కావడం లేదు. గొప్ప గొప్ప ఆటగాళ్లకు చుక్కలు చూపించిన బుమ్రా కు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడంటే.. అయ్యర్ ఎంత కసరత్తు చేసాడో అర్థమవుతుందని” మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.
Shreyas iyer vs bumrah
10 yrs challenge pic.twitter.com/LWdbR8RGaB
— CURRY (@chef_curryyy) June 2, 2025