Viral Video : సాధారణంగా 50ఏళ్లు దాటగానే ఒళ్లంతా నొప్పులతో ఏ పని చేయాలన్న చేతకాని రోజులు ఇవి. ప్రస్తుతం మారిన జీవిన విధానం కారణంగా చిన్న వయసులోనే వృద్ధాప్యం రావడం సాధారణం అయిపోయింది. దీంతో కనీసం ఎక్కువ దూరం కూడా నడవలేని వారున్నారు. కానీ ఓ బామ్మ మాత్రం వయస్సు కేవలం ఒక సంఖ్య అని అంటుంది. ఇప్పటికీ నేను యూత్ అంటూ ఆశ్చర్యపరుస్తోంది. 80ప్లస్ లోనూ పిల్లలతో సమానంగా ఈత కొడుతుంది. ఈత కొట్టడంలో ఆశ్చర్యమేమిటని ఆలోచిస్తున్నారా.. తను మామూలుగా ఈత కొట్టడం లేదు. బంగీ జంప్ లు వేస్తూ కొట్టడం అక్కడున్న వాళ్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
తాజాగా 84 ఏళ్ల అమ్మమ్మ స్విమ్మింగ్ పూల్‌లో చేసిన విన్యాసాన్ని వీక్షకులను షాక్ కు గురి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వయసులో కూడా వృద్ధురాలి ఉత్సాహాన్ని చూసి ఇంటర్నెట్ జనాలు ఆమెకు వీరాభిమానులుగా మారారు. వైరల్ అవుతున్న వీడియో ప్రారంభంలో, ఒక వృద్ధ మహిళ స్విమ్మింగ్ పూల్ మెట్లు ఎక్కడం చూడవచ్చు. దీని తరువాత తను విశ్వాసంతో పూల్ చాలా అంచున నిలుచుంది. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్‌లో 84 ఏళ్ల బామ్మ చాలా విచిత్రమైన విన్యాసాలు చేయడం వీడియోలో కనిపిస్తుంది. అమ్మమ్మ ఫీట్ చూసి కళ్లు బైర్లు కమ్ముతాయి. ఈ వయసులో ఉన్న వృద్ధురాలి ఉత్సాహం చూస్తే మీరు కూడా ఆమెకు వీరాభిమానులు అవుతారు.
ఈ వయస్సులో ఉన్న మహిళల్లో ఇలాంటి చురుకుదనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఇది ఈ వృద్ధ మహిళ వీడియోలో కనిపిస్తుంది. బామ్మ విన్యాసాలు చూసి నెటిజన్లు చలించిపోయి ఆమె స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నారు. 84 ఏళ్ల వృద్ధురాలు తన స్టంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన వీడియో ఇక్కడ చూడండి.
బామ్మ స్విమ్మింగ్ పూల్ కు మెట్లు ఎక్కడంతో వీడియో మొదలవుతుంది. బామ్మ మెట్లు ఎక్కి రావడం మీరు చూడవచ్చు. దీని తరువాత, ఆమె పూర్తి విశ్వాసంతో పూల్ అంచున నిలబడింది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. పూల్ అంచు నుండి బామ్మ బ్యాక్‌ఫ్లిప్ చేయడం మీరు చూడవచ్చు. దీని తరువాత అది నేరుగా నీటిలోకి వెళుతుంది. 84 ఏళ్ల వయసులో ఒక మహిళా స్టంట్‌మ్యాన్ ఇలా చేయడం మీరు చూసి ఉండరు. ఇన్‌స్టా హ్యాండిల్ @lucineiabridgeతో వీడియోను షేర్ చేసిన తర్వాత, ఓ నెటిజన్ నేను అసూయపడుతున్నాను. ఆమె వయస్సు 84 సంవత్సరాలు, కానీ ఆమె సరదాగా జీవితాన్ని గడుపుతోంది అంటూ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్‌ను ఇప్పటి వరకు 80 వేల మందికి పైగా లైక్ చేయగా, కామెంట్ల వరద పారుతోంది.