Viral Video : అది కర్ణాటక రాష్ట్రంలోని హసన్ అనే ప్రాంతం.. అక్కడ ఆది చుంచనగిరి కళ్యాణమండపం. అక్కడ ఇద్దరు యువతీ యువకులకు పెళ్లి చేయడానికి బంధువులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ముహూర్తం కూడా ఖరారు చేశారు. సరిగ్గా ఆరోజు రానే వచ్చింది. దానికంటే ముందు పెళ్లిచూపులు.. ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చివరికి పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకుని.. వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మండపంలో అద్భుతమైన డెకరేషన్ వేయించారు. వచ్చే అతిధుల కోసం బ్రహ్మాండమైన విందు భోజనాలు కూడా సిద్ధం చేశారు. వధూవరులు ఇద్దరు ధగధగా మెరిసిపోతూ కనిపించారు.. ఇక పెళ్లి ఘడియ రానే వచ్చింది. పెళ్లి వేదిక మీదికి ముందు వరుడు.. కొంత సమయం తర్వాత వధువు వచ్చారు. తాళికట్టే సమయంలో వధువు అనుకోని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి మారిపోయింది. వచ్చిన అతిథులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Also Read : ఈ స్టార్ హీరోలు బావ బామ్మర్దులనే విషయం మీకు తెలుసా..?
ఇంతకీ ఏం చేసిందంటే
ఆ వధువుకు గతంలోనే ఒక వ్యక్తితో పరిచయం ఉంది. అది కాస్త ప్రేమగా మారింది. వారిద్దరు వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కాకపోతే ఆ అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఏమాత్రం ఒప్పుకోలేదు. పైగా కులాలు వేరని వారు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆ అమ్మాయి అప్పటినుంచి ఆవేదనలో కూరుకుపోయింది. చివరికి ఆ అమ్మాయి మనసు మార్చడానికి కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం అంటూ లేదు. మొత్తానికి వేరే అబ్బాయితో వివాహం నిర్ణయించారు. వివాహం చేసుకోకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామని ఆమెను బెదిరించారు. దీంతో తట్టుకోలేక ఆ అమ్మాయి ఒప్పుకుంది. అయితే తీరా వివాహం జరిగే సమయానికి ఆ అమ్మాయి ప్రేమించిన వాడిని మర్చిపోలేక.. అతనితోనే ఉంటానని చెప్పింది. దీంతో పెళ్లి కుమారుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
“నేను ఫలానా అబ్బాయిని ప్రేమించాను. అతడినే పెళ్లి చేసుకుంటాను. నీతో కలిసి ఉండలేను. నన్ను క్షమించండి. నేను అతడిని చాలా రోజులుగా ప్రేమిస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్లే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. నేను అతనితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని అంగీకరించండి” అంటూ ఆ యువతి పెళ్లి కుమారుడితో వ్యాఖ్యానించింది. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నది. ఆ అమ్మాయి చేసిన పని పై నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఆ వధువు.. వివాహం చూసేందుకు వచ్చిన బంధువులకు పెళ్లి మండపంలో ఆర్య సినిమాను లైవ్ లో చూపించారని నెటిజన్లు పేర్కొంటున్నారు.
డేరింగ్ పెళ్లి కూతురు.. తన పెళ్లిని తానే ఆపుకుంది!
కాసేపట్లో పెళ్లి చేసుకోబోతున్న వధువు తన పెళ్లిని తానే ఆపుకుంది. ఈ ఘటన కర్ణాటక హసన్‌లోని ఆదిచుంచనగిరి కళ్యాణమండపంలో ఈ ఘటన జరిగింది. తాను వేరే అబ్బాయిని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. పోలీసుల రక్షణ మధ్య… pic.twitter.com/SB4XAGuQil
— ChotaNews App (@ChotaNewsApp) May 24, 2025