https://oktelugu.com/

Bandi Sanjay: బండి సంజయ్ పాట పాడిండు.. వైరల్ వీడియో

Bandi Sanjay: కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్‌(బార్గవాపురం)లో శ్రీసరస్వతీ శిశుమందిర్‌ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 1, 2024 / 10:40 AM IST

    Central Minister Bandi Sanjay Singing a Song

    Follow us on

    Bandi Sanjay: కేంద్ర హోం శాఖ సంహాయ మంత్రి బండి సంజయ్‌ సింగర్‌గా మారారు. సరస్వతీ శిశుమందిర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పాటపాడి ఆకట్టుకున్నారు. తొలిసారి ఆయన పాటపాడడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై స్పందిస్తున్నారు.

    హుస్నాబాద్‌లో…
    కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్‌(బార్గవాపురం)లో శ్రీసరస్వతీ శిశుమందిర్‌ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా శిశుమందిర్‌లోనే చదువుకున్నానని తన అనుభవాలను చెప్పుకొచ్చారు.

    హిందూ ధర్మం హేళనలో..
    హిందూ ధర్మం, హిందే దేవుళ్లను హేళన చేసే పరిస్థితులు సమాజంలో కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మనలోని అనైక్యతే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు ఒక పాట గుర్తుకు వస్తుంని రాగం అందుకున్నారు. ‘ఈ భూమి బిడ్డలం హిందువుల అందరం.. కష్టసుఖములలోన కలిసిమెలసి ఉంటే బతుకు సుఖమయ్యేనురా.. బంగారు కలలన్నీ పండేనురా.. అనే పాట పాడాఇ వినిపించారు. బండి సంజయ్‌ పాటకు అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టి ప్రశంసించారు.