Viral video : అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. మహారాజ్ గంజ్ ప్రాంతం. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. ఓ చిరుత పులి ఆకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. ఇద్దరి యువకులు, ఓ మహిళపై దాడి చేసింది. వారిని చంపడానికి ప్రయత్నించింది. పులి ఎందుకు వచ్చిందో, తమపై ఎందుకు దాడి చేస్తుందో తెలుసుకునేలోపే వారి మీద పడి హతం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. తన పంజా దెబ్బ చూపించేందుకు సమాయత్తమైంది. ఈ దశలో ఓ యువకుడు ఆ పులి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పక్కనే ప్రవహిస్తున్న నదిలోకి దూకాడు. దీంతో అతడిని చంపడానికి ఆ పులి కూడా కాలువలో దూకింది. అయితే ఈ విషయాన్ని ఆ మహిళ, మరో యువకుడు ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు కర్రలు, ఇతర ఆయుధాలను పట్టుకొని ఆ ప్రాంతానికి వచ్చారు. వాళ్లు కూడా నదిలోకి దూకారు. కర్రలు, ఇతర ఆయుధాలతో పులిని బెదిరించడానికి ప్రయత్నించారు. జనం ఎక్కువగా ఉండడం.. పులి ఆత్మరక్షణ కోసం భయపడడం తో ఒకసారిగా పరిస్థితి మారిపోయింది. అప్పటిదాకా పై చేయి సాధించిన పులి.. వెనకడుగు వేసింది. దీంతో గ్రామస్తులు పులిని బిగ్గరగా పట్టుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న తాళ్లతో దానిని గట్టిగా అదిమి పట్టారు. అయితే అలా అందరూ ఒకేసారి మీద పడటంతో పులి మీద ఒత్తిడి పెరిగిపోయింది. దానికి శ్వాస ఆడక పోవడంతో కన్ను మూసింది.. అయితే ఈ విషయంపై సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
వెన్నులో వణుకు
మహారాజ్ గంజ్ ప్రాంతం అడవులకు కాస్త దగ్గరగా ఉంటుంది. అయితే అక్కడ నుంచి చిరుత పులి జనావాసాల్లోకి వచ్చింది. అడవిలో ఆహారం లభించకపోవడంతో చిరుత పులి ఈ ప్రాంతం వైపు వచ్చిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఆహారం లభించకపోవడంతో మనుషుల మీద దాడికి దిగిందని.. అయితే అందులో ఒక వ్యక్తి నదిలో దూకడంతో.. అతడిని చంపి తినడానికి చిరుత పులి ప్రయత్నించిందని అటవీశాఖ అధికారులు వివరిస్తున్నారు. ప్రాణ రక్షణ కోసం అతడు ముందుకు ఈదగా.. పులి కూడా అతడిని అనుసరించిందని పేర్కొంటున్నారు. చివరికి గ్రామస్తులు ఒకసారిగా మీద పడటంతో పులి మీద ఒత్తిడి పెరిగిపోయిందని.. అందువల్లే శ్వాస ఆడక అది చనిపోయిందని వివరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని.. విచారణ కొనసాగిస్తున్నామని అటవీశాఖ అధికారులు అంటున్నారు. మొత్తంగా ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.. చిరుతపులిని ఊపిరాడకుండా చేసి చంపేసిన గ్రామస్తులపై అభినందనల జల్లు కురుస్తోంది. మీకు ఎన్ని సాహస అవార్డులు ఇచ్చిన తక్కువే అంటూ నెటిజన్లు ఆ గ్రామస్తులను కొనియాడుతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ లో చిరుత పులి ఒక మహిళ, యువకులపై దాడి చేసింది. ఓ యువకుడు తన ప్రాణాలు కాపాడుకునేందుకు నదిలో దుకాడు. ఈ క్రమంలో స్థానికులు అక్కడికి చేరుకొని చిరుతను పట్టుకున్నారు. అది ఊపిరాడక చనిపోయింది.#UttarPradesh#leopard pic.twitter.com/NPa9vdTnLw
— Anabothula Bhaskar (@AnabothulaB) December 4, 2024