Drone camera : ఎగిరి వస్తుంది ఏంట్రా అది.. పరుగులంకించుకున్న పిల్లాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో

ఓ విలేజ్‌లో ముగ్గురు పిల్లలు ఒక దగ్గర సరదాగా ఆడుకుంటున్నారు. అదే సమయంలో వారిదగ్గరి ఒక్కసారిగా డ్రోన్ వచ్చి ఆగింది. ఆ డ్రోన్ చూసిన పిల్లగాళ్లు ఇది ఏంటి ఇలా ఉందని ఒక్కసారిగా చూసి భయపడ్డారు. అందులో ఇద్దరు పిల్లలు పరిగెత్తారు. కానీ ఒక పిల్లాడు అయితే ఆగకుండా పరిగెత్తాడు.

Written By: Srinivas, Updated On : August 18, 2024 6:40 pm

Drone camera

Follow us on

Drone camera : ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే చాలు.. క్షణాల్లోనే వైరల్ అయిపోతాం. ఇలా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా సెలబ్రీటీలు కూడా అయ్యారు. అయితే ఈమధ్య కాలంలో డ్రోన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఫొటోషూట్‌లు, ప్రీ వెడ్డింగ్ షూట్‌లు వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి వాడకం కూడా బాగా పెరిగింది. చిన్న పిల్లగాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామందికి తెలిసే ఉంటుంది. మనుషులు వెళ్లి షూట్ చేయలేని కొన్ని ప్రదేశాలకు డ్రోన్ పంపించి షూట్ చేయిస్తుంటారు. అక్కడ లోకేషన్ ఎలా ఉంటుందని చూడటానికి పంపిస్తారు. అయితే ఈమధ్య కాలంలో ఫంక్షన్లలో కూడా డ్రోన్‌తో షూట్ చేస్తున్నారు. దీనిని చూసిన ఓ పిల్లాడు ఒక్కసారిగా పరుగులు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఓ విలేజ్‌లో ముగ్గురు పిల్లలు ఒక దగ్గర సరదాగా ఆడుకుంటున్నారు. అదే సమయంలో వారిదగ్గరి ఒక్కసారిగా డ్రోన్ వచ్చి ఆగింది. ఆ డ్రోన్ చూసిన పిల్లగాళ్లు ఇది ఏంటి ఇలా ఉందని ఒక్కసారిగా చూసి భయపడ్డారు. అందులో ఇద్దరు పిల్లలు పరిగెత్తారు. కానీ ఒక పిల్లాడు అయితే ఆగకుండా పరిగెత్తాడు. ఏదైనా దెయ్యం తన వెంట పడుతుంది ఏమోనని భయపడినట్లుగా పరిగెత్తాడు. పరిగెత్తినంత సేపు వెనక్కి చూసుకుంటూ మరి ముందుకు వెళ్లాడు. అసలు ఇదేంటి నా వెనుక పరిగెడుతుందని అనుకుని పారిపోతున్నాడు. ఆ పిల్లోడు వెనుక డ్రోన్ వెళ్తుండగా మధ్యలో ఇద్దరు మహిళలు కనిపిస్తారు. అక్కడితో డ్రోన్ ఆగిపోతుంది. అయితే డ్రోన్‌ను చూసి ఆ పిల్లగాడు అలా పరిగెత్తగా నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఈ వీడియో వాళ్లకు నవ్వులను పూయించింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సోషల్ మీడియాలో చాలా వ్యూస్, లైక్స్ కూడా వచ్చాయి.

సిటీలో పెరిగిన పిల్లలు ఏదో ఒక సమయంలో డ్రోన్ చూసే ఉంటారు. కానీ పల్లెటూరులో ఉండే వాళ్లు వాటిని చూడటం కుదరదు. అందరి పిల్లలకి డోన్ గురించి తెలిసే అవకాశం ఉండదు కదా. ఈ పిల్లలు కూడా గ్రామానికి చెందిన వాళ్లు. ఇంతవరకు వాళ్లు డ్రోన్‌ను చూడకపోవచ్చు. అలా వెనుక వస్తుందంటే భయపట్టేది అయి ఉంటుందని భావించి ఆ పిల్లగాళ్లు భయంతో పరుగులు తీశారు. సోషల్ మీడియా అంతా ఆ డ్రోన్ బుడ్డోడు గురించి చర్చించుకుంటున్నారు.