Viral video : దట్టంగా కురిసే మంచు.. అతి శీతల గాలులు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రాంతంలో లభించే యాపిల్ పండ్లు సరికొత్త రుచిని కలిగి ఉంటాయి. అందుకే సిమ్లా ప్రాంతాన్ని మిగతా కాలాలతో పోల్చితే.. శీతాకాలంలో ఎక్కువమంది సందర్శిస్తుంటారు.. అక్కడి అతి శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటారు. అక్కడ ఎత్తైన కొండల్లో ఉండే విడిది గృహాలలో కాఫీ తాగడాన్ని.. విండో ద్వారా ద్వారా మంచు కురుస్తున్న దృశ్యాలను అనుభూతి చెందుతుంటారు. అందువల్లే శీతాకాలంలో సిమ్లా ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.. సిమ్లా ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యాటక కేంద్రాలు రద్దీగా ఉంటాయి. సిమ్లా ప్రాంతంలో ప్రస్తుతం విపరీతమైన మంచు కురుస్తోంది. మైనస్ డిగ్రీలలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. యాపిల్ కాయలు కోతకు వచ్చాయి. ఈ వాతావరణ పరిస్థితులు అక్కడి ప్రజలకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. పర్యాటకులకు అమితమైన ఆనందాన్ని అందిస్తున్నాయి.
మంచు పేరుకుపోతున్నది..
సిమ్లా ప్రాంతం తెల్లని రంగు పులుముకుంది. దట్టంగా కురుస్తున్న మంచుతో వెండి నగరిగా మురిసిపోతోంది. కొండల నుంచి మొదలుపెడితే భవనాల వరకు మంచు దట్టంగా పేరుకుపోయింది. ఇప్పుడు సిమ్లా ప్రాంతాన్ని చూస్తుంటే.. అన్నయ్య సినిమాలో “హిమసీమల్లో” పాట గుర్తుకు వస్తోంది. హిమపాతం వల్ల ఆ ప్రాంతం తెల్లటి శాటిన్ చీర కట్టుకున్నట్టుగా మారిపోయింది.. గృహాలు, పెద్ద పెద్ద బిల్డింగులు, చెట్లు, రహదారులు మంచుతో కూరుకుపోయాయి. శీతల వాతావరణం కావడంతో నూతన దంపతులు హనీమూన్ కోసం ఇక్కడికి వస్తున్నారని సిమ్లా పర్యాటక అధికారులు చెబుతున్నారు..” కొంతకాలంగా ప్రవేట్ హోటల్స్ నిండిపోయాయి. పర్యాటక విడిది కేంద్రాలు కూడా రద్దీగా మారిపోయాయి. నూతన దంపతుల రాకతో ఈ ప్రాంతం సందడిగా మారింది. ప్రస్తుత శీతల వాతావరణాన్ని నూతన దంపతులు ఆస్వాదిస్తున్నారు. ఇక్కడి సరస్సుల్లో విహరిస్తున్నారు. ఎత్తైన కొండల్లో హిమ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. యాపిల్ తోటల్లో సరదాగా గడుపుతున్నారు. ఇంత చక్కటి వాతావరణాన్ని వారు భూతల స్వర్గం లాగా భావిస్తున్నారు. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది కావచ్చు. పర్యాటకులు రావడంతో ఇక్కడ స్థానిక వ్యాపారాలు కళకళలాడుతున్నాయని” సిమ్లా పర్యాటక అధికారులు చెబుతున్నారు.
ఆధ్యాత్మికతకు కూడా..
సిమ్లా ప్రాంతం మంచుకు మాత్రమే కాదు.. నిలువెత్తు ఆధ్యాత్మికతకు కూడా పెట్టింది పేరు. ఇక్కడ శైవాలయాలు విశేషంగా ఉంటాయి. వాటి వెనుక చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంటుంది. అందువల్లే ఇక్కడికి వచ్చే పర్యాటకులు మంచును మాత్రమే కాకుండా, శైవాలయాలను కూడా సందర్శిస్తుంటారు. ఆధ్యాత్మికతను పెంపొందించుకుంటారు. ఆలయాలలో శివుడికి జరిగే పూజల్లో పాల్గొంటారు..
దట్టంగా కురిసే మంచుతో సిమ్లా ప్రాంతం ప్రస్తుతం భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. ఉత్తరాది ప్రాంతంలో చలి తీవ్రత పెరగడంతో వెండి నగరిగా సిమ్లా ప్రాంతం మారిపోయింది. మంచు దట్టంగా కురుస్తుండడంతో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. #Shimla #snowtime pic.twitter.com/j0yyDGO23X
— Anabothula Bhaskar (@AnabothulaB) December 10, 2024