Viral Video : సోషల్ మీడియాలో చాలా వీడియోలు రోజు వైరల్ అవుతుంటాయి. ఇందులో పెళ్లికి సంబంధించిన వీడియోలు మరింత ఎక్కువగా ఉంటాయి. రీసెంట్ గా ఒక అమ్మాయిని ప్రేమించి, పెళ్లి మరొకరితో ఫిక్స్ చేసుకున్న వ్యక్తి వద్దకు ప్రియురాలు వచ్చి చేసిన హంగామా వీడియో తెగ వైరల్ అయింది. ఏకంగా ఆయన పెళ్లి డేట్ తెలుసుకొని వచ్చి గొడవ చేయడంతో ఆ వీడియో తెగ వైరల్ గా మారింది. అయితే ఇలాంటి వీడియోలు కూడా ఎక్కువగానే షేర్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోలు కొన్ని చూడటానికి ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం షాక్ కు గురి చేస్తుంటాయి.
ఏది ఏమైనా కొన్ని వీడియోలు వైరల్ గా మారి ఫేమస్ అవుతుంటారు కూడా. ఇప్పుడు కూడా అలాంటి ఒక ఫన్నీ వీడియో గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూశాక మీరు చాలా నవ్వుకుంటారు కూడా. ఇక ఈ వైరల్ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ వచ్చి చేరాయి. నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ వీడియో ఏంటి? ఏమైంది అనే వివరాలు తెలుసుకుందాం.
పెళ్లి విషయంలో వధువరులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి విషయాన్ని జ్నాపకంగా మలుచుకోవాలి అనుకుంటారు. ఇక ఇప్పుడు అయితే పెళ్లిల్లు వివాహాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి కుటుంబం వారి కుమార్తె కోసం ఉత్తమ అబ్బాయి కావాలి అని చూస్తున్నారు. కానీ అందరి జీవితంలో ఇవి నెరవేరవు. ఇక ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో వరుడు చేసిన పని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. అయితే వధువరుకు కొత్తగా పెళ్లి జరిగినట్టు ఉంది. కానీ ఏకంగా తన భార్యను అమ్మడానికి తీసుకొని వెళ్లాడు. ఏంటి వధువును అమ్మడానికి తీసుకొని వెళ్లాడా అని షాక్ అవుతున్నారా?
వధువును రిక్షా బండి మీద కూర్చొబెట్టుకొని తీసుకొని వెళ్తే ప్రతి ఒక్కరు అదే కదా అనుకునేది. అయితే SuperfastamdavadLive Instagramలో షేర్ చేసిన ఈ వీడియోలో వరుడి గెటప్‌లో ఉన్న యువకుడు తన వధువును రిక్షా బండిపై తీసుకొని వీధులు మొత్తం తిప్పుతున్నాడు. బండిని తన చేతులతో నెట్టాడు. కాసేపు తోసుకుంటూ వెళ్లాడు. కొద్ది సేపు తర్వాత రద్దీగా ఉన్న రోడ్డు దాటాడు. వధువు మాత్రం ఆ బండిపై హాయిగా కూర్చొంది.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. నవవధువును అమ్మడానికి బయలుదేరాడని ఒకరంటే మరొకరు తగ్గింపు రేటు గురించి సమాచారం కావాలి అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం డిమాండ్ ఎక్కువ ఉంటుంది బ్రో అని మరికొందరు స్పందిస్తున్నారు. ఏంటి బ్రో మరో వెహికిల్ లేనట్టు ఇలా రిక్షా మీద తీసుకొని వెళ్తున్నావు అంటున్నారు కొందరు. మరికొందరు ఇదేం పిచ్చిరా నాయనా ఇలా కొత్తగా పెళ్లి అయిన తర్వాత రోడ్డు మీద ఇలా తిరుగుతున్నారు అంటున్నారు.