Viral video : ఆ అమ్మాయి పేరు నెల్లి.. పుట్టింది రష్యాలో. గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆసియా ఖండంలో ఉన్న ఓ సంస్థలో పనిచేస్తోంది. ఈ అమ్మడికి మన దేశమంటే చాలా ఇష్టం. మనదేశంలోని ప్రజలంటే ఇంకా ఇష్టం. అందువల్లే రష్యన్ ను కాకుండా.. ఇండియన్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.. అందానికి పోత పూసినట్టు ఉంటుంది కాబట్టి.. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చాలా ఎక్కువ. పైగా ఈ యువతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్.. చిన్న చిన్న వీడియోలు చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. పైగా ఈ అమ్మడికి ఫ్యాషన్ అంటే చాలా పిచ్చి.. కొత్త కొత్త గాడ్జెట్స్ కొనుగోలు చేస్తూ ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సులు వేసి అదరగొడుతుంది. అయితే అలాంటి ఈ అమ్మాయి నుంచి పెళ్లి ప్రకటన రాగానే చాలామంది యువకులు రెస్పాండ్ అయ్యారు. కాకపోతే ఇండియన్స్ కు మాత్రమే ఈ అవకాశమని ఆమె చెప్పడంతో ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఇంతకీ ఆ యువతి చేసిన పెళ్లి ప్రకటనలో.. తనకు కాబోయే భారతీయ వరుడిలో ఎలాంటి లక్షణాలు కావాలో.. స్పష్టంగా చెప్పేసింది.
కాబోయే వరుడు ఎలా ఉండాలంటే..
నెల్లి ప్రస్తుతం ఉద్యోగరీత్యా దుబాయ్ లో నివసిస్తోంది. తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో నెల్లి చెప్పేసింది. ఆ వీడియోలో నెల్లి చెప్పిన వివరాల ప్రకారం.. ఆమెను చేసుకోబోయే భారతీయ వరుడు ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండాలి. కళ్ళు ఆకుపచ్చ రంగులో ఉండాలి. అతడు సంగీతాన్ని ఇష్టపడే వ్యక్తై ఉండాలి. అతడికి డ్యాన్స్ లో ప్రావీణ్యం ఉండాలి. పర్యటనలను ఎక్కువగా ఇష్టపడాలి.. అంతేకాదు నెల్లి ని విపరీతంగా ప్రేమించాలి. ఆమె మాట్లాడుతున్నంత సేపు.. ఆ మాటలను అతడు ఆస్వాదిస్తూ ఉండాలని..నెల్లి ఆ వీడియోలో పేర్కొంది. ఈ వీడియోను ఇప్పటివరకు 2.5 లక్షల మంది ఇష్టపడ్డారు. అంతకంటే ఎక్కువ సంఖ్యలో వీడియోను చూశారు. దానికి తగ్గట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. ” నాలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ నాకు ఆకుపచ్చ కళ్ళు లేవు. వెళ్లి చెప్పిన క్వాలిటీస్ ఉన్న ఒకే ఒక భారతీయ వ్యక్తి హృతిక్ రోషన్ మాత్రమేనని” ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ” నేను ఎరుపు రంగులో ఉంటాను. ఆరడుగుల ఎత్తు ఉంటాను. సంగీతాన్ని ఇష్టపడతాను. ఇతర ప్రాంతాలలో పర్యటించడానికి ఆసక్తి చూపిస్తుంటాను. నెల్లి మాట్లాడుతుంటే పోగుడుతుంటాను. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంటాను. అయితే నేను గ్రీన్ కలర్ లెన్స్ ధరించవచ్చా.. దానికి నెల్లి ఒప్పుకుంటుందా.. నన్ను వివాహం చేసుకుంటుందా.. తన భాగస్వామిగా అంగీకరిస్తుందా” అని ఓ నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించాడు.