https://oktelugu.com/

Viral Video: కష్టపడకుండా పక్కోడి సొమ్మును దోచుకోవడం అంటే ఇదే.. వీడియో వైరల్..

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటి మధ్య ఉండే పోరాట సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. ఒక జంతువుపై మరో జంతువు నిత్యం దాడి చేస్తుంటుంది. అలా చేస్తేనే అవి బతుకుతాయి. అయితే ఒక్కోసారి కొన్ని జంతువులు, పక్షులు అవి నేరుగా సాధించుకోకుండా ఇతర జంతువులు సంపాదించుకున్న ఆహారాన్ని దొంగిలించాలని చూస్తుంటాయి.

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2024 / 12:25 AM IST

    Viral Video

    Follow us on

    Viral Video:  జీవితంలో డబ్బు బాగా డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. కొందరు రాత్రనక, పగలనక నిరంతరం కష్టపడి ధనాన్ని కూడబెట్టుకుంటారు. మరికొందరు మాత్రం ఎవరైతే కష్టపడి సంపాదిస్తారో.. వారి సొమ్మును ఏమాత్రం కష్టం లేకుండా దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. చాలా మంది ఇలా దోచుకొని అభివృద్ధి సాధించిన వారు ఉన్నారు. కానీ అది తాత్కాలిక ఆనందమే అని కొందరు అంటుంటారు. ‘కష్టపడంది ఏదీ రాదు.. కష్టపడకుండా వచ్చింది కలకాలం నిలవదు..’ అన్న సామెత ప్రకారం కష్టపడి సంపాదించినది ఏదైనా జీవితాంతం ఉంటుందని అంటారు. కానీ కొందరు మేధావులు చెబుతున్న ప్రకారం.. ఇది కలికాలం.. ఇప్పుడంతా కాయ కష్టం చేయకుండా సంపాదించాలని చూస్తున్నారని అని చెబుతున్నారు. అయితే ఇది కేవలం మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో కూడా ఉందని ఓ వీడియో చెబుతోంది. ఆ వీడియో ఏంటి? అందులో ఏముంది?

    జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటి మధ్య ఉండే పోరాట సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. ఒక జంతువుపై మరో జంతువు నిత్యం దాడి చేస్తుంటుంది. అలా చేస్తేనే అవి బతుకుతాయి. అయితే ఒక్కోసారి కొన్ని జంతువులు, పక్షులు అవి నేరుగా సాధించుకోకుండా ఇతర జంతువులు సంపాదించుకున్న ఆహారాన్ని దొంగిలించాలని చూస్తుంటాయి. ఇక్కడ ఓ మొసలి తాను సంపాదించుకున్న ఆహారాన్ని ఓ గద్ద వచ్చి ఎత్తుకెళ్లాలని చూస్తుంది. అయితే చివరికి ఏం జరిగిందంటే?

    క్రుగర్ ఉత్త భాగంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇక్కడున్న గావిన్ ఎల్లార్డ్ అతని కుటుంబంతో కలిసి పపురి బోర్డ్ రెస్ట్ క్యాంపునకు వచ్చాడు. ఇక్కడున్న ఓ కొలను వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో అక్కడున్న లులువు అనే నది నుంచి కొన్ని శబ్దాలు రావడం ప్రారంభించాయి. అదేంటో తెలుసుకోవడానికి ఎల్లార్డ్ తన కెమెరాను తీసుకొని వెళ్లాడు. అక్కడికి వెళ్లాక అతనికి ఓక మొసలి ఆప్రికన్ పందిని వేటాడి పట్టుకొంది. దీనిని మెల్లగా తినడానికి ప్రయత్నిస్తోంది.

    అయితే ఇంతలో అక్కడికి ఓ గద్ద వచ్చింది. మొసలి తినే ఆహారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించింది. వెంటనే ఓ మాంసపు మొక్కను అందుకుంది. అయితే ఇది గమనించిన మొసలి గద్దను వెంటాడడం ప్రారంభించింది. తాను కష్టపడి సంపాదించిన ఆహారాన్ని ఇతరులు తీసుకెళ్లడం ఎవరికీ నచ్చదు. అందువల్ల మొసలి తన ఆహారాన్ని వదిలేసి మరీ గద్దను పట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే గద్ద ఎలాగోలా మొసలి నుంచి తప్పించుకుంది. కానీ బరువైన మాంసపు ముద్దను పట్టుకొని ఎగరడానికి ప్రయత్నించింది. దాని బరువు మోయలేక నీటిలోనే వదిలేసింది.

    దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్ లో చోటు చేసుకున్న ఈ వీడియోను గావిన్ ఎల్లార్డ్ అనే వైల్డ్ ఫొటోగ్రాఫర్ షూట్ చేశాడు. ఆ తరువాత దీనిని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడంతో అది వైరల్ గా మారింది. సెప్టెంబర్ 2న అప్లోడ్ చేసిన ఈ వీడియోకు రెండు రోజుల్లోనే 11 లక్షల వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఈ వీడియోను లైక్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు.