https://oktelugu.com/

Viral video : సరదాగా జంగిల్ సఫారీకి వెళితే.. పులి ఎదురయింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మనలో చాలామందికి జంతువులను జూ లో లేదా డిస్కవరీ ఛానల్ లో చూసిన అనుభవం ఉంటుంది. కానీ కొంతమంది శ్రీమంతులకు అలా కాదు. వారు నేరుగా జంగిల్ సఫారీకి వెళ్తారు. జంతువులను దగ్గరగా చూస్తారు. అలా జంగిల్ సఫారీ కి వెళ్ళిన వారికి వింత అనుభవం ఎదురయింది. అనుకోకుండా జరిగిన సంఘటన వారికి షాకింగ్ పరిణామాన్ని కళ్ళ ముందు చూపించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 1, 2024 / 08:46 AM IST

    Jungle Safari

    Follow us on

    Viral video :  రాజస్థాన్ రాష్ట్రంలో రణతంబోర్ పేరుతో నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడ జంగిల్ సఫారీ కోసం ఎక్కడెక్కడ నుంచో పర్యాటకులు వస్తుంటారు. అలా కొంతమంది పర్యాటకులు ఆ నేషనల్ పార్క్ ను సందర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు రకరకాల జంతువులను చూస్తూ కేరింతలు కొడుతున్నారు. ఇలా ఉండగానే వారికి షాకింగ్ పరిణామం ఎదురయింది. ఆ అడవిలో ఒక పెద్ద గోడ పక్కన వాహనాలు ఆపుకొని ఉండి పర్యాటకులు పులులను చూస్తున్నారు. ఎకరంలో ఒక పెద్ద పులి అడవి నుంచి హఠాత్తుగా గోడ పైకి ఎగిరింది. అంతే అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు. సమీపంలో జీపులో ఉన్న వారిని చూసిన పులి వారి మీదకు దూపడానికి ప్రయత్నించింది. వారంతా మరింత గట్టిగా కేకలు వేయడంతో పులి ఎక్కడి నుంచి పరుగు తీయడం మొదలుపెట్టింది. దీంతో వాహనాల్లో ఉన్న వారంతా బతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరైతే పులి అలా వెళ్ళినప్పటికీ భయపడుతూనే ఉన్నారు. ఇంకా కొందరు అలానే అరుస్తూనే ఉన్నారు. చుట్టుపక్కల వారు మాత్రం పులి వస్తున్నప్పుడు అలానే చూస్తూ ఉండిపోయారు. ఇక ఈ దృశ్యాలను కొంతమంది తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది.

    నెటిజన్లు ఏమంటున్నారంటే..

    ఇప్పటికే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. వేలల్లో కామెంట్స్ పొందింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ” సహజంగా అడవిలో జంతువులు పులుల అరుపులకు భయపడితాయి. ఇక్కడ మాత్రం ఆడవాళ్ళ అరుపులకు పులి భయపడిందని” కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయగా..”అడవిలో జంతువులను చూస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఇష్టానుసారంగా శబ్దాలు చేస్తే అవి ఇలానే ప్రవర్తిస్తాయి. పులి మీదకు దూకే సమయంలో ఆరిచారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ సమయానికి అలా అరిచిన వారి గొంతులు మూగబోయి ఉండేవి. జంగిల్ సఫారీ కి వెళ్ళిన వారు పులికి ఆహారమై ఉండేవారు. అందుచేత జంతువుల దగ్గరికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు మనుషుల లాగా ప్రవర్తించకుండా ఉండాలి. అన్నింటికీ మించి అడవిలో నిశ్శబ్దంగా ఉండాలి. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇదిగో ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్థూలంగా చూస్తే చావు చివరి అంచుదాకా వెళ్లి వచ్చినట్లు కనిపిస్తోంది. జంగిల్ సఫారీ కి వెళ్లే పర్యాటకులకు ఈ వీడియో ఒక పాఠం అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదని” కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించారు.