Viral Video : స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక.. ప్రపంచంలో ఏ మూలన.. ఏ విషయం జరిగినా.. వెంటనే తెలిసిపోతుంది. ప్రస్తుతం 5జీ జెట్ స్పీడ్ తో దూసుకెుళ్తుండడంతో చాలా మంది ఈ నెట్ వర్క్ అందుబాటులో ఉండే మొబైల్స్ కొనుగోలు చేసి వాడుతున్నారు. దీంతో కొన్ని వీడియోలు సైతం ఈజీగా డౌన్లోడ్ అవుతుండడంతో ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఊహించిన సంఘటనను చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా పామును చూడగానే ఎవరికైనా భయం వేస్తుంది. ఇదే సమయంలో మనుషుల నుంచి తమకు ఎలాంటి ఆపద వస్తుందోనని పాములు కూడా అడుగు శబ్దం వినగానే భయపడిపతుంది. కానీ ఓ పాము రోడ్డుపైనే చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ పాము నడిరోడ్డుపై ఏం చేసింది?
పాములు సరీసృపాలు ప్రపంచ వ్యాప్తంగా 2,900 రకాల పాములు ఉన్నట్లు కొన్ని పరిశోధనలను బట్టి తెలుస్తోంది. ఒక్క అంటార్కిటికా ప్రాంతంలో మినహా దాదాపు భూమి ఉన్న చోట పాములు ఉన్నాయి. పాముల్లో విషపూరితమైనవి, విషం లేనివి ఉన్నాయి. కొన్నింటికి నోటిలో విషం ఉంటే..మరికొన్నింటికి వెనకబాగంలో విషం ఉంటుంది. పాముకు చెవులు ఉండవు. కానీ ఇవి అడుగుల శబ్దాలను గ్రహిస్తాయి. వీటికి శరీరంలోనే వినబడే శక్తి ఉంటుంది. వీటికి ఉండే కళ్లు మూతపడకుండా ఉంటాయి.
పాములు కొందరికి మేలు చేస్తాయని అంటారు. ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో ఎక్కువగా ఎలుకలు ఉండడం వల్ల పంట మడులు నాశనం అవుతూ ఉంటాయి. అయితే పాములు వాటిని తింటూ పంటలను కాపాడుతాయని అంటారు. కానీ చాలా మంది పాముకాటుకు గురై మరణిస్తున్నారు. ప్రతీ ఏటా 50 లక్షల మంది పాముకాటుకు గురై మరణిస్తున్నట్లు కొన్ని లెక్కలు చెబుతున్నాయి. భారతదేశంలో పాములు 250 జాతులు ఉన్నట్లు సమాచారం. వీటిలో నాగుపాము విషపూరితమైనది. కానీ కొన్ని ప్రాంతాల్లో నాగుపామును దేవతగా పూజిస్తారు. నాగచవితి, పంచమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పాముల్లో అత్యంత విషపూరితమైనవి కింగ్ కోబ్రాలు. పాములు ఏవైనా సంతానంగా గుడ్లు మాత్రమే పెడుతాయి. సాధారణంగా వసంత కాలంలో పాములు గుడ్లు పెడుతాయి. ఇవి 45 నుంచి 70 రోజుల్లో పొదిగి ఆ తరువాత పాము రూపంలో బయటకు వస్తుంది. పాము గుడ్డు 5 అంగుళాల వరకు ఉంటుంది. ఒకేసారి పాము 50 గుడ్లు పెట్టగలదు. పాము తన నుంచి వచ్చిన గుడ్లను పాములుగా మారే వరకు వాటిని జాగ్రత్తగా చూసుకుంటుంది. గుడ్డు నుంచి వచ్చిన పాము అసలైన పాముగా మారడానికి 4 సంవత్సరాలు పడుతుంది.
అయితే తాజాగా ఓ వీడియో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సాధారణంగా పాములు గుడ్లు పెడితే ఒక పాము మాత్రం నేరుగా పాము పిల్లలను కన్నది. అదీ కాకుండా ఈ పాము నడిరోడ్డుపై ఇలా పాము పిల్లలను కనడంతో దీనిని కొందరు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాము నేరుగా పాములను కనడం ఇదే మొదటిసారి అని కొందరు కామెంట్ చేస్తున్నారు.