Viral Video : కొందరు అప్పుడప్పుడు చెప్పే కొన్ని సామెతలు నిజ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఎవరైనా వింతగా ప్రవర్తిస్తే ‘కల్లు తాగిన కోతిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్?’ అని అంటూ ఉంటారు. కోతి కల్లు తాగితే వింతగా ప్రవర్తిస్తుందని దాని అర్థం. అయితే కొన్ని ప్రదేశాల్లో కోతులు నిజంగానే కల్లు తాగిన దృశ్యాలు చూసి ఉంటారు. కాన ఓ కోతి మాత్రం నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా బీర్ తాగుతూ కనినిపిచింది. మనుషులతో దగ్గరి సంబంధాలు ఉండే మంకీస్.. వీరు తినే ఆహారాన్ని తాగే ద్రవాన్ని సేవిస్తూ ఉంటాయి. ఇందులో బాగంగా మద్యాన్ని కూడా సేవిస్తూ ఉన్నాయని కొందరు అంటున్నారు. అయితే తాజాగా ఓ మంకీ బీర్ బాటిల్ ఎత్తి మరీ తాగుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూడ్డానికి చాలా సరదాగానే కనిపిస్తుంది. కానీ ఇది ప్రమాదకరం అని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఎందుకంటే?
ప్రపంచంలో మనుషుల్లాగే జంతువులకు ఊపిరి ఉంటుంది. వీటికి ప్రకృతితో సంబంధాలు ఎక్కువ. జంతువుతు తమకు కావాల్సిన ఆహారాన్ని అవి సంపాదించుకోవాల్సిందే. అయితే నగరీకరణ, పట్టణీకరణలో భాగంగా చాలా ప్రదేశాల్లో అడవుల శాతం తగ్గిపోతుంది. దీంతో చాలా రకాల జంతువులు మనుషులు ఉండే ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఇటీవల చిరుతల ఎక్కువగా మనుషులు ఉండే ప్రాంతాల్లో తిరగడం చూస్తున్నాం. అడవుల్లో వాటికి నివాసం కరువు కావడంతో ఇవి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
మిగతా జంతువుల కంటే కోతులు మనుషులకు దగ్గరి సంబంధాలను కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా అడవుల్లో కంటే దేవాలయాల్లో మనుషులు తిరిగే ప్రాంతాల్లోని చెట్లపై కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి ఆహారం కోసం ఒక్కోసారి మనుషులపై దాడి చేస్తున్న సంఘటనలు చూస్తుూ ఉంటాం. ఇవి కేవలం ఆహారం కోసమే అని గుర్తంచుకోవాలి. అంతేకాకుండా వీటి కోసం ప్రత్యేకంగా మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే అవి మనుషులపై ఆహారం కోసం దాడులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా ఓ మంకీ ఆహారం కోసం మనుసులు తాగే బీర్ తాగాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే ఈ వీడియో బ్రెజిల్ కు సంబంధించినది. బ్రెజిల్ లోని పరానాలో ఓ ఓ కోతి డస్ట్ బిన్ పై కూర్చొని ఎవరో మిగిల్చి ఉంచిన బీర్ ను తాగుతూ కనిపించింది. అయితే ఈ వీడియో చూడ్డానికి సరదాగానే అనిపిస్తుంది. కానీ ఇది ప్రమాదకరమని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛత పాటించకపోతే జంతువులు ప్రమాదంలో పడుతాయని అంటున్నారు. ముఖ్యంగా పర్యావరణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కొన్ని వ్యర్థాలను జంతువులు తినడం వల్ల వాటి ద్వారా తిరిగి మనుషులకే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
అయితే గతంలో ఓ కోతి మద్యం షాపులోకి వెళ్లి మరీ బీర్ తాగిన దృశ్యం బయటపడింది. అందువల్ల మద్యంను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా డిస్ మాటిల్ చేయాలని అంటున్నారు. అంతేకాకుండా మిగతా వ్యర్థాలను పారివేయడంలో కేర్ తీసుకోవాలని కోరుతున్నారు.
m macaco bêbado provou que somos mais parecidos do que pensávamos após beber uma cerveja que havia encontrado no lixo enquanto espectadores atônitos assistiam.
O vídeo, filmado no Paraná, mostra dois macacos-prego sentados em uma lata de lixo enquanto um deles bebe uma cerveja… pic.twitter.com/TRY3TSYLiW
— Gazeta Brasil (@SigaGazetaBR) October 10, 2024
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: The monkey was seen drinking beer in the park as per todays trend
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com