https://oktelugu.com/

Viral Video : పెళ్లయిన తొలిరోజు ఎలా గడిచిందో వీడియో షేర్ చేసిన దంపతులు..

ఓ జంట మాత్రం కొత్తగా పెళ్లయిన తరువాత ఇద్దరు వ్యక్తుల మధ్య ఆహభావాలు, ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పాడు. వారు అనుభవించిన జీవితం గురించి వీడియో ద్వారా ప్రేక్షకులకు పంచుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : December 25, 2024 / 06:10 PM IST

    Couple shared a video

    Follow us on

    Viral Video :  దాంపత్య జీవితం చాలా అందమైనది. ముఖ్యంగా పెళ్లయిన కొత్తలో జీవితం మరింత మధురంగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారికి పెళ్లయిన తరువాత కామన్ లైఫ్ ఉండొచ్చు. కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వారి జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు తెలియని వ్యక్తులు కలిసి జీవితాన్ని పంచుకోబోతుంటారు. ఇందులో భాగంగా తొలి రోజుల్లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అన్నట్లుగా ఉంటుంది. ఈ పరిస్థితి ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు. కానీ వారు అనుభవించిన జీవితం గురించి ఇతరులకు మాటల్లో చెప్పలేరు. కానీ ఓ జంట మాత్రం కొత్తగా పెళ్లయిన తరువాత ఇద్దరు వ్యక్తుల మధ్య ఆహభావాలు, ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పాడు. వారు అనుభవించిన జీవితం గురించి వీడియో ద్వారా ప్రేక్షకులకు పంచుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందంటే?

    చేతిలోకి మొబైల్ వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ తమ జీవితం గురించి ఇతరులకు పంచుకుంటున్నారు. కొందరు తమ పెళ్లికి సంబంధించిన వీడియోలు మాత్రమే కాకుండా శోభనానికి సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇందులో భాగంగా కొత్తగా పెళ్లయిన తరువాత దంపతుల మధ్య ప్రవర్తన, ఆహభావాలు ఎలా ఉంటాయి? ఏం చేస్తారు? అనే విషయాలు చాలా మందికి ఆసక్తిని కలిగిస్తాయి. ముఖ్యగా యూత్ వీటికి బాగా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఓ జంట పెళ్లయిన తరువాత రోజు జీవితం ఎలా ఉంటుందో రికార్డు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

    ఈ వీడియోలో ఏముందంటే? ఉదయం నిద్ర లేచే సమయంలో అన్యోన్యంగా ఉంటారు. ఆ తరువాత స్నానం చేసే సమయంలో బాత్రూం వాడకంలో ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉంటారు. ఆ తరువాత వీరి కుటుంబ సభ్యుల వారికి హారతిని ఇస్తారు. ఈ సమయంలో వారిద్దరు కలిసి హారతి తీసుకోవాలని సూచిస్తారు. ఆ తరువాత ఇంటిని సర్దుకోవడంలో ఒకరికి ఒకరు సాయం చేసుకుంటారు. మిగతా పనుల్లో కూడా భార్యకు సాయంగా భర్త ఉంటాడు. ఏ పని చేసినా కలిసి మెలిసి చేస్తారు.

    మొత్తంగా ఈ వీడియోలో అర్థమైంది ఏంటంటే? కొత్తగా పెళ్లయిన తరువాత ఆడవాళ్ల కంటే మొగవాళ్లే చాలా భయపడిపోతూ ఉంటారు. తన కుటుంబాన్ని వదిలి కొత్త ఇంటికి వచ్చిన అమ్మాయి సాధారణంగా భయంతో ఉంటుంది. కానీ నేటి కాలంలో అలా కాదు..మగవారే బిడియంగా ఉంటారని వీడియో చూస్తే అర్థమవుతోంది. అంతేకాకుండా తమ ఇంటికి వచ్చిన ఆమెను ఎంతో గౌరవిస్తారని అర్థమవుతుంది. పెళ్లయిన తరువాత 16 రోజుల పండుగ అంటారు. అంటే కొన్ని రోజుల పాటు వీరు అన్యోన్యంగా ఉండడానికి అవకాశం ఇస్తారు. అయితే తొలి రోజు లైఫ్ చాలా ఆసక్తిగా ఉంటుంది.

    ఈ వీడియోను చూసిన వారు వారు తెగ లైక్ లుకొట్టేస్తున్నారు. తాము కూడా ఈ జీవితాన్ని అనుభవించామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు పెళ్లయిన కొత్తలో ఇలాగే ఉంటుంది.. ఆ తరువాత మారిపోతుంది.. అని అంటున్నారు. ఇంకొందరు మాత్రం దంపతుల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటే ఎప్పటికీ ఇలాగే ఉంటారని అంటున్నారు. ఏదీ ఏమైనా పెళ్లయిన కొత్తలో ఉండే ఆ రోజులు మళ్లీ తిరిగి రావని కొందరు కామెంట్స్ చేయడం విశేషం.