https://oktelugu.com/

Viral video : అంతమంది ముందు పెళ్లి పీటల మీద అదేం పనిరా పెళ్లికొడుకా.. వైరల్ వీడియో

ఒక పెళ్లికొడుకు బాగా బిడియంగా కనిపిస్తాడు. అతడిని ఆట పట్టించడానికి వధువు బంధువులు రెడీ అవుతారు. వధువు సోదరి కొత్త పెళ్లికొడుకుకు తీపి తినిపించడానికి రెడీ అవుతారు. ఇంతలో ఒక స్పూన్ లో ఒక స్వీట్ ను తీసుకొచ్చి అతని నోటి దగ్గర ఉంచుతారు. కానీ అతడు తల పైకి లేపకుండా కిందికిమాత్రమే చూస్తాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 6, 2024 / 02:25 AM IST

    Viral video

    Follow us on

    Viral video : పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమానికి బంధువులు, మిత్రులను ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తారు. ఈ క్రమంలో పెళ్లి వేడుకలో సంతోషాలు, దు:ఖాలు, నవ్వులు, కోపాలు కనిపిస్తాయి. అయితే ఏ పెళ్లిలో అయినా పెళ్లి కొడుకును ఆటపట్టించే కార్యక్రమం ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కొడుకును స్నేహితులు తమతో స్నేహానికి దూరం అవుతాడనే ఉద్దేశంలో కొందరు ఫన్నీ మూమెంట్స్ చేస్తుంటారు. ఇవి ఒక్కోసారి పేలుతూ ఉంటాయి. ఇక పెళ్లిలో అమ్మాయి తరుపున వారు అబ్బాయిని ఏడిపించే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో కొందరు పెళ్లికొడుకులు చాకచక్యంగా ఉంటే.. మరికొందరు మాత్రం బుక్కయిపోతారు. ఇక్కడ ఓ పెళ్లికొడుకుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక్కడ ఆ వరుడు ఏం చేశాడో చూడండి..

    సోషల్ మీడియాలో ఈ మధ్య పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా వధూ వరులు మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఇటీవల పెళ్లి కొడుకు కోసం ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. అప్పటి నుంచి ప్రతీ పెళ్లిలో ఏదో ఒక ఫన్నీ మూమెంట్ ఉండేలా చూసుకుంటున్నారు. లేటేస్ట్ గా ఓ పెళ్లి కొడుకును ఆటపట్టించడానికి చేసిన పని నవ్వు తెప్పిస్తుంది. ఇందులో పెళ్లి కొడుకు చేసిన ప్రవర్తన్నకు అందరూ ‘ఇప్పుడే ఇలా ఉన్నాడు.. రాను రాను ఎలా ఉంటాడో’ అని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఏం చేశాడంటే?

    ఒక పెళ్లికొడుకు బాగా బిడియంగా కనిపిస్తాడు. అతడిని ఆట పట్టించడానికి వధువు బంధువులు రెడీ అవుతారు. వధువు సోదరి కొత్త పెళ్లికొడుకుకు తీపి తినిపించడానికి రెడీ అవుతారు. ఇంతలో ఒక స్పూన్ లో ఒక స్వీట్ ను తీసుకొచ్చి అతని నోటి దగ్గర ఉంచుతారు. కానీ అతడు తల పైకి లేపకుండా కిందికిమాత్రమే చూస్తాడు. అయినా ఆమె స్వీట్ తో ఉన్న స్పూన్ ను అక్కడే ఉంచుతుంది. ఎంతసేపయినా అలాగే ఉంచేసరికి పక్కనున్న వారు వరుడిని ఫోర్స్ చేస్తారు.

    ఇంతలో పెళ్లికొడుకు ఒక్కసారిగా ఆస్పూన్ పై ఉన్న స్వీట్ ను టక్కున నోట్లోకి లాక్కుంటాడు. అయితే అప్పటి వరకు అమాయకంగా కనిపించిన ఆ పెళ్లికొడుకు ఒక్కసారిగా ఎవరో తీసుకెళ్తారు అన్నట్లుగా ఒక్కసారిగా నోట్లోకి తీసుకోవడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా నవ్వుులు పూయించారు. అయితే ఈ సన్నివేశాన్ని మరో వ్యక్తి వీడియో తీశారు. ఈ వీడియోనూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది వైరల్ గా మారింది. కొందరు ఈ పెళ్లి కొడుకు ఆగలేకపోతున్నాడు.. అని కామెంట్ చేస్తుండగా.. మరికొందరు రకరకాలగా మెసేజ్ పెడుతున్నారు. సాధారణంగానే పెళ్లిమండపంలో జరిగే ఫన్నీ మూమెంట్స్ ను లైక్ చేస్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించడంతో లైక్స్ కొడుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి పెళ్లికొడుకుతో జాగ్రత్తగా ఉండాలి.. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే.. రాను రాను ఎలా ఉంటాడో.. అనిఅంటున్నారు.