Viral Video : నోకియా 1100 నుంచి మొదలు పెడితే ఆపిల్ 16 ప్రో వరకు వచ్చేసాం. మామూలు నెట్వర్క్ నుంచి ప్రారంభించి 5జి వరకు ప్రయాణం సాగించాం. భవిష్యత్తు కాలంలో ఇంకా ఇంకా గొప్ప గొప్ప సాంకేతిక మార్పులను చూస్తాం. సాంకేతిక కాలంలో జీవిస్తాం. మరి ఇంతటి పరిణామక్రమంలో మనిషి జీవితం మారిపోవాలి కదా. మనిషి ఆలోచనలు కొత్తగా ఉండాలి కదా. సంఘజీవి కాస్త మరింతగా తన సంఘాన్ని విస్తరించుకోవాలి కదా.. బంధాలను బలోపేతం చేసుకోవాలి కదా.. మరి ఏం జరుగుతోంది?
సోషల్ మీడియాలో ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో ఉంది సింగర్ సమీరా భరద్వాజ్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కానీ ఈమె చేసిన ఒక రీల్ మాత్రం ఆలోచింపజేస్తోంది. ఒక మనిషి సాంకేతిక కాలంలో తన జీవితాన్ని ఎంతలా కోల్పోతున్నాడో.. ఎలాంటి విలువలను వదులుకుంటున్నాడో.. ఈ వీడియోలో స్పష్టంగా సమీరా భరద్వాజ్ వివరించారు. ఒకప్పుడు ఎవరైనా పిల్లాడు ఎదురుపడితే ఏం చదువుతున్నావు అని అడిగితే డిగ్రీ నో, బీ టెకో, ఎంబీబీఎస్సో అని చెప్పేవారు. అప్పట్లో ఆ కోర్సులకు విలువ ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఆ కోర్సులు చదివే వారి కంటే ఇన్ ఫ్లూయన్సర్ల కు విలువ పెరిగింది. అందువల్లే దృవ్ రాటి కి ఉన్నంత క్రేజ్ ఒక డాక్టర్ కు లేదు. అయితే ఒక డాక్టర్ చేసే పని ధృవ్ చేస్తాడా అని మీలో ప్రశ్న ఉదయించవచ్చు. కానీ మన సమాజం గౌరవాన్ని మాత్రమే కోరుకుంటుంది.. అదికూడా ఒక స్థాయిలో ఉండాలని ఆశిస్తుంది. అందువల్లే ప్రస్తుత కాలంలో గొప్ప గొప్ప వాళ్లకంటే సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న వాళ్లకే విలువ ఎక్కువగా ఉన్నది.
సమీరా భరద్వాజ్ ఈ వీడియోలో సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులను తనదైన శైలిలో వ్యంగ్యాన్ని జోడించి చెప్పారు. యూట్యూబ్ ఛానల్స్, ఫేస్ బుక్ పోస్టులు, ఇన్ స్టా రీల్స్, స్నాప్ చాట్ లైవ్, థ్రెడ్ ఆక్టివిటీ గురించి ప్రముఖంగా వివరించారు. వచ్చే తరం పై సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉంటుందో స్పష్టం చేశారు. అయితే ఇప్పటికిప్పుడు ఆమె చెప్పిన మార్పులు చోటు చేసుకోకపోయినప్పటికీ.. భవిష్యత్తు కాలంలో అలాంటివే జరుగుతాయని చెప్పకనే చెప్పారు. మొత్తంగా మనిషి సోషల్ జీవి స్థాయి నుంచి సో సెల్ జీవికి పడిపోయాడని.. వచ్చే రోజుల్లో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని సమీరా భరద్వాజ్ తన వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. దీనిపై రక రకాల కామెంట్ వినిపిస్తున్నాయి..” ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు సమీరా భరద్వాజ్ గారు.. ఇది చాలామందికి కనెక్ట్ అవుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే దీన్ని ఎవరు అంత త్వరగా జీర్ణించుకోలేరు. ఎందుకంటే సోషల్ మీడియాకు అంతలా బానిసలు అయిపోయారు కాబట్టి” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఫ్యూచర్ జనరేషన్ గురించి కరెక్టుగా చెప్పింది
“సోషల్ మీడియా అంటే కంపరం అంట
మా కడుపున చెడపుట్టావ్ కదే ” pic.twitter.com/rWG044PUWx— హైపర్ రెడ్డి (@MrHyperReddy) October 2, 2024