https://oktelugu.com/

Viral Video : పంతులైన పెళ్లి కొడుకు.. తన వేద మంత్రాలు తానే చదువునే పెళ్లి.. వీడియో వైరల్

ఓ పంతులు మాత్రం తన వివాహానికి తానే మంత్రాలు చదువుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అలా అని పంతులు లేకపోవడం వల్ల ఆ వరుడు పెళ్లి మంత్రాలు చదవలేదండి. పంతులను పక్కన పెట్టి.. వివాహానికి మంత్రాలు చదివాడు. తాను చదివే మంత్రాల్లో ఏవైనా తప్పులు ఉన్నాయా? లేదా? అని అతన్ని చూడమని చెప్పి తన పెళ్లికి తానే మంత్రాలు చదివాడు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 28, 2025 / 11:00 PM IST
    Viral Video

    Viral Video

    Follow us on

    Viral Video :  పెళ్లి అనేది పవిత్రమైన బంధం. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని వేదమంత్రాల సాక్షిగా పెళ్లి (Marriage) చేస్తారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవితాంతం ఎలాంటి గొడవలు లేకుండా బతకాలని కోరుకుంటారు. అందుకే పెళ్లిలో ఒక్కో కార్యక్రమం చేస్తూ వాటి గొప్పతనాన్ని తెలియజేస్తారు. పెళ్లిలో (Marriage) జరిగే ఒక్కో కార్యక్రమానికి ఒక్కో అర్థం కూడా ఉంటుంది. పూర్వం రోజుల్లో అయితే పెళ్లిళ్లు గంటల తరబడి జరిగేవి. కానీ ప్రస్తుతం పెళ్లిళ్లు అయితే ఏదో జరగాలని జరుగుతున్నాయి. అసలు వేద మంత్రాలు ఉండవు, సెకన్లలో వివాహం అయిపోతుంది. మరికొందరు అయితే ఎలాంటి వేద మంత్రాలు లేకుండా ఏదో ఆలయంలో లేదా సన్నిహితుల సమక్షంలో చేసుకుంటున్నారు. ఎంత పంతులు అయినా కూడా తన వివాహం వేరే పంతులతోనే చేయించుకుంటారు. కానీ తాజాగా ఓ పంతులు మాత్రం తన వివాహానికి తానే మంత్రాలు చదువుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అలా అని పంతులు లేకపోవడం వల్ల ఆ వరుడు పెళ్లి మంత్రాలు చదవలేదండి. పంతులను పక్కన పెట్టి.. వివాహానికి మంత్రాలు చదివాడు. తాను చదివే మంత్రాల్లో ఏవైనా తప్పులు ఉన్నాయా? లేదా? అని అతన్ని చూడమని చెప్పి తన పెళ్లికి తానే మంత్రాలు చదివాడు. ఇలా తన పెళ్లికి తాను స్వయంగా మంత్రాలు చదవడంతో కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి పందిరిలో ఉన్న వారు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

    వివరాల్లోకి వెళ్తే.. సహరన్పుర్ జిల్లాలోని రాంపుర్ మణిహరన్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ కొడుకి వివాహం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో హరిద్వార్ జిల్లాలోని కుంజా బహదూర్‌పుర్ గ్రామానికి చెందిన వధువుతో ప్రవీణ్ కుమార్ కొడుకు వివేక్ కుమార్‌కి నిశ్చయించారు. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాలు ఎంతో ఘనంగా పెళ్లి జరిపిస్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా ఊరేగింపు చేసుకుని పెళ్లి మండపానికి వరుడు, వధువు వెళ్లారు. శుభ ముహుర్త సమయంలో ఇద్దరూ కూడా పూల మాలలు మార్చుకున్నారు. ఆ తర్వాత మూడు ప్రదక్షిణలు చేశారు. అయితే ఈ సమయంలో వరుడు తానే చేసుకుంటానని పూజారికి తెలియజేశాడు. వివాహ ఆచారాలు అన్నింటిని కూడా తానే నిర్వహిస్తానని, మతపరమైన ఆచారాల మంత్రాలను కూడా తానే చదువుతానని తెలిపాడు. చెప్పినట్లుగానే తన పెళ్లికి తానే స్వయంగా మంత్రాలు చదివాడు. దీంతో అందరూ కూడా ఆ వరుడిని ప్రశంసించారు. ఎంత చక్కగా వివాహ మంత్రాలు అన్ని కూడా పఠించాడని పొగిడారు. పూజారి పక్కన ఉండగానే పెళ్లి మంత్రాలు అన్ని కూడా తప్పులు లేకుండా చదివాడు. మత పరమైన ఆచారాలపై నమ్మకం ఉండటం వల్ల వేదమంత్రాలను ఆ వరుడు నేర్చుకున్నాడు. తప్పులు లేకుండా ఇలా తన పెళ్లి మంత్రాలు తానే చదవడంతో పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ వరుడిని వావ్ అంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది పెళ్లి ఎలా చేస్తారనే విషయం తెలియదు. దానికి ఉన్న పవిత్రత కూడా తెలియదు. అలాంటి పెళ్లి మంత్రాలు అన్నింటిని కూడా ఎలాంటి తప్పులు లేకుండా చదవడంతో నెటిజన్లు వివేక్‌ను పొగడుతున్నారు.