Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శీతకాలంలో చలి విపరీతంగా ఉంటుంది. ఈ రాష్ట్రం ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది. హిమాలయాలకు చేరువలో ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు చలికాలంలో రికార్డు స్థాయిలో పడిపోతుంటాయి. ఢిల్లీకి దగ్గరలో ప్రాంతాల్లో అయితే అత్యల్పంగా నమోదు అవుతుంటాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతుంటారు. ఇంకా కొంతమంది అయితే రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాలలో తలదాచుకొని.. ఉదయం మళ్లీ ఇతర పనులకు వెళ్లిపోతుంటారు. ఇలా వారు తమ బతుకు బండిని లాగిస్తుంటారు. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని చార్ బాగ్ రైల్వే స్టేషన్లో కొంతమంది పేదలు రాత్రిపూట పడుకున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత రైల్వే స్టేషన్ అధికారులు రంగంలోకి దిగారు. వారందరినీ అక్కడి నుంచి వెలగొట్టడానికి చల్లటి నీళ్లు చల్లారు.. చలికాలం.. ఉష్ణోగ్రతలు దారుణంగా ఉన్నాయి.. అలాంటి తరుణంలో వారిపై చల్లటి నీళ్ళు చల్లడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే ఇందులో పేదలతో పాటు ప్రయాణికులు కూడా ఉన్నారు. మహిళా ప్రయాణికులు, చిన్నపిల్లలపై చల్లటి నీరు పడటంతో వారు తీవ్రంగా విలపించారు. ఈ దృశ్యాలను సమీపంలో ఉన్న కొంతమంది ప్రయాణికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల వేదికగా వెలుగులోకి తీసుకొచ్చారు.
ఆలస్యంగా వెలుగులోకి
ఈ ఘటన ఇటీవల జరిగినప్పటికీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిని కొంతమంది సామాజిక మాధ్యమాల ద్వారా తెరపైకి తేవడంతో అక్కడి అధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.. దీనిపై అక్కడ మీడియా కూడా కథనాలను ప్రసారం చేయడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది..” వాళ్లు అసలు మనుషులేనా? వాళ్లను మనుషులని ఎలా అనాలి? పేదలపై, ప్రయాణికులపై ఇంత ప్రతాపం ఎలా చూపుతారు? చల్లటి నీళ్లు ఎలా చల్లుతారు? ఇలా నీళ్లు చల్లితే ఆ ప్రయాణికులు ఎలా ఉండగలుగుతారు? కొంచమైనా మానవత్వం ఉండకర్లేదా? ఇలాంటి దారుణమైన పని చేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోరు? రైల్వే స్టేషన్లో పడుకుంటే దేశానికి వచ్చిన నష్టం ఏంటి? ఆ ప్రాంతంలో పడుకునే వాళ్ళు ఏమైనా దేశద్రోహులా? దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని జైల్లో పెట్టి మేపుతున్నారు.. కానీ అధికారులు అమాయకులైన పేదలపై.. ప్రయాణికులపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. ఇలాంటి వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని” సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పేర్కొంటున్నారు. రైల్వే స్టేషన్లో కొంతమంది పోకిరిలు.. ఆకతాయిలు తలదాచుకుంటున్నారు కాబట్టే తాము ఆ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని రైల్వే శాఖ అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రయాణికులపై నీళ్లు చల్లాల్సిన అవసరం తమకు లేదని వారు వివరించారు.
ఉత్తరప్రదేశ్లోని చార్బాఘ్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికులపై చల్లని నీళ్లు చల్లిన అధికారులు. అసలే ఇబ్బంది పెట్టే చలి.. పైగా చల్లని నీరు చల్లడంతో ఇబ్బంది పడ్డ చిన్న పిల్లలు.. మహిళలు.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.#UttarPradesh pic.twitter.com/siaHhD1WGT
— Anabothula Bhaskar (@AnabothulaB) January 1, 2025