https://oktelugu.com/

Viral Video : ఇండియాలోనూ ఐఫోన్ అంటే పడి చస్తున్నారు.. ఎందుకింతలా ఎగబడుతున్నారు? వైరల్ వీడియో

అదేం బంగారం కాదు. వజ్రం అంతకన్నా కాదు. పోనీ ఖరీదైన ప్లాటినం కూడా కాదు. కాని దానికోసం జనం ఎగబడుతున్నారు. డబ్బులు చెల్లించి తీసుకుంటున్నప్పటికీ కుక్కల్లా (క్షమించాలి) పరిగెడుతున్నారు. ఆలసిం చినా ఆశాభంగం.. మంచి తరుణం మించినా దొరకదని ఉరుకులు పెడుతున్నారు. ఇంతకీ వారు దేనికోసం ఇంత తాపత్రయ పడుతున్నారంటే..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 20, 2024 / 02:07 PM IST

    iPhone 16

    Follow us on

    Viral Video : అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించే ఆపిల్ కంపెనీ ఐఫోన్ -16 ను విడుదల చేసింది. సహజంగానే ఈ ఫోన్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. ప్రతి ఏడాది విడుదల చేసే కొత్త మోడల్ పై ఆసక్తి ఉంటుంది. పైగా చాలామంది ఐఫోన్ వాడటాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. అందువల్లే ఐఫోన్ విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కంపెనీ కూడా భారీగా లాభాలను ఆర్జిస్తూ ఉంటుంది. ఈ ఫోన్ ఖరీదు లక్షల్లోనే ఉంటుంది. తాజాగా విడుదల చేసిన కొత్త మోడల్ ధర దాదాపుగా లక్ష వరకు ఉంటుంది. ధర అంత ఉన్నప్పటికీ ఆ ఫోన్ ను దక్కించుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. ఆ ఫోన్ ను నిన్నటి నుంచి ఆపిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మనదేశంలో పోల్చితే దుబాయ్ ప్రాంతంలో ఆ ఫోన్ ధర 40, 000 తక్కువకు లభిస్తోంది. మనదేశంలో ఐఫోన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆపిల్ కంపెనీ ధర పెంచి విక్రయిస్తోంది.

    నెట్టింట విమర్శలు

    ఐఫోన్ విక్రయాలను మనదేశంలో ప్రారంభించిన నేపథ్యంలో.. వినియోగదారులు ఆ ఫోన్ సొంతం చేసుకున్నందుకు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. యుగాంతం ఏదో వచ్చినట్టు.. చిరంజీవి సినిమా విడుదలైనట్టు.. ఒక్కసారిగా ఉరుకులు పెట్టారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ” ఓటు వేయాలంటే బద్ధకం.. ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలంటే బద్ధకం.. కానీ ఇలాంటి వాటికైతే పరుగులు తీస్తారు.. ఉదయాన్నే లేచి వస్తారు.. ఇలాంటి వాళ్లు ఉన్న తర్వాత మన దేశాన్ని ఎవరూ బాగు చేయలేరని” వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఆపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ తాజా సిరీస్ ధర మనదేశంలో ఎక్కువని అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

    ఆరోపణలు ఉండడంతో..

    ఇటీవల కాలంలో ఆపిల్ కంపెనీ తయారు చేస్తున్న ఐఫోన్లు తరచూ హ్యాక్ అవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆపిల్ కంపెనీ స్పందించినప్పటికీ.. ఆ తరహా వార్తలు ఆగడం లేదు. పైగా కొంతమంది సెలబ్రిటీలు తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయని బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. అయినప్పటికీ ఆపిల్ కంపెనీ విడుదల చేసిన కొత్త సిరీస్ ఐఫోన్లకు గిరాకీ విపరీతంగా ఉండడం విశేషం. అయితే ఆపిల్ కంపెనీ ఇటీవల కాలం నుంచి తన పాత మోడల్ ఫోన్లను తక్కువకు విక్రయించడం మొదలుపెట్టింది. అయితే ఆ ఫోన్లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు పెద్దగా ముందుకు రాలేదు. పైగా పాత మోడల్స్ లో ఉన్న అవరోధాలు తమను ఇబ్బంది పెడుతున్నాయని కొంతమంది వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.

    &