Pawan Kalyan Daughter : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ప్రజా సేవలో తలమునకలు అయ్యారు. జనాలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కార మార్గాలు చేపడుతున్నారు. అదే సమయంలో పెండింగ్ లో ఉన్న షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు. కొంత మేరకు షూటింగ్ జరుపుకుని ఉన్నాయి. విరామ సమయంలో ఈ చిత్రాల షూటింగ్స్ కి ఆయన హాజరవుతున్నారు.
కొత్త సినిమాలకు పవన్ కళ్యాణ్ సైన్ చేయడం లేదు. ఈ క్రమంలో అకీరా హీరోగా పరిచయం కావాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అకీరా పక్కా హీరో మెటీరియల్. అందుకు కావలసిన వయసు, పరిపక్వత కూడా వచ్చాయి. గతంలో రేణు దేశాయ్ పూణేలో ఉండేవారు. ప్రస్తుతం అకీరా, ఆద్యలతో హైదరాబాద్ లోనే నివాసం ఉంటుంది. రేణు దేశాయ్ ఇటీవల కమ్ బ్యాక్ ఇచ్చింది. టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలక రోల్ చేసింది.
రేణు దేశాయ్ కి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆమె తరచుగా కాశీని సందర్శిస్తూ ఉంటారు. కూతురు ఆద్యతో పాటు కాశీకి వెళ్ళింది. అక్కడ ఆటో రిక్షాలో ప్రయాణం చేశారు. ఆటో రిక్షా రైడ్ విత్ ఆద్య అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చిన రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఆద్య సింప్లిసిటీకి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. తండ్రి పవన్ కళ్యాణ్ వలె ఆద్య కూడా చాలా సింపుల్. ఏసీ కార్లను వదిలి సామాన్యుల మాదిరి ఆటోరిక్షాలో ప్రయాణం చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాకు వంద కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో చాలా సింపుల్ గా ఉంటారు. ఫార్మ్ హౌస్లో పశువులను మేపుతూ, వ్యవసాయం చేయడం, పుస్తకాలు చదవడం ఆయనకు ఇష్టం. ఆయన పిల్లలు కూడా ఇదే తరహాలో ఉన్నారు. ఆదర్శాలలో కూడా పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నారు. విడాకులు అయినప్పటికీ పిల్లల కోసం పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ స్నేహం కొనసాగిస్తున్నారు. పుణేలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చేవారని రేణు దేశాయ్ తెలియజేశారు.