Pot Seller: ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ మహిమా బజాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి వారినైనా క్షాణాల్లో అద్భత శిల్పంగా మార్చగలదు. జుట్టు నుంచి పాదాల వరకు అందంతో మెరిపించగలదు. అందుకే మహిమా బజాజ్ కు ఎక్కువ మంది ఫిదా అవుతుంటారు. తను బయటకు వెళ్లిన సమయంలో చూసిన వారికి ఒప్పించి తన స్టూడియోకు తీసుకువచ్చి అందమైన అమ్మాయిగా మారుస్తుంది. ఈ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తుంది. మహిమా వీడియోలు చాలా వైరల్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా మహిమా బజాజ్ చేసిన అద్భుతమైన మేకప్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ వీడియో వైరల్ అవుతోంది. రోడ్డుపక్కన మట్టి కుండలు అమ్మే యువతిని ఆమె అందంగా మార్చేసింది. మహిమా తాను చేసిన ప్రతీ పనిని కెమెరాలో బంధిస్తుంది. ప్రతి స్టెప్‌ను వివరిస్తూ ఈ వీడియోను తన ఇన్ స్టా పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆమె ప్రతిభను అభినందించారు.
మహిమా సదరు యువతికి మేకప్ స్ట్రాట్ చేసింది. మొదట జుట్టును ఎంచుకుంది. జుట్టు తక్కువగా ఉన్న చోట త్రిఫల చూర్ణం, ముల్తానీ మట్టి, పెరుగు మిశ్రమం తలకు రాసి మసాజ్ చేసింది. ఆ తర్వాత ఫ్యాషనబుల్‌గా జుట్టు కత్తిరించింది. ఆ యువతి ముఖం మరింత కాంతివంతంగా కనిపించేలా చేయాలనుకుంది. ముఖంపై ఉన్న చాయను తగ్గించి, స్కిన్ మృదువుగా అయ్యేందుకు ఆలోవెరా, వేప మిశ్రమం ఉపయోగించింది. కొన్ని అందం పెంచే పద్ధతులు ఉపయోగించి కుండలు అమ్మే యువతిని ఫ్యాషన్ స్టార్‌గా మార్చేసింది. ఆమెను గుర్తుపట్టడం కూడా కష్టంగానే మారింది.
మహిమా బజాజ్ అద్భుతమైన మేకప్ ఆర్టిస్ట్. ఆమె చాలా మందికి మేకప్ వేసి అందంగా మార్చింది. టీ అమ్ముకునే వాళ్లు, బట్టలు ఉతకే వాళ్లు, రోడ్డుపై చెత్త తీసే వాళ్లు ఇలాంటి చాలా మందిని తన మేకప్ ద్వారా అద్భుతంగా మార్చింది.
తాను చేసే పనిని తాను ప్రేమిస్తానని అందుకే నేను ఆనందంగా ఉంటానని మహిమా బజాజ్ చెప్తోంది. వీరందరినీ ఎంచుకోవడంలో నాకు చాలా ఆనందం కలుగుతుందని, లక్షలు ఖర్చు చేసే వారికి వేసే మేకప్ కంటే ఇలాంటి పేదలకు మేకప్ వేస్తే వారి అందాన్ని వారు చూసుకొని తనను ప్రేమగా చూస్తే వారిలోని ఆనందం తనను మరింత ఆనంద పరుస్తుందని చెప్పుకచ్చారు.
ఇతరులకు మేకప్ వేయడంపై మహిమా బజాజ్ ను చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఫ్యాషన్ షోలు, ఫొటో షూట్ల కోసం మోడల్స్‌కు కూడా మేకప్ వేస్తుంది. తాజాగా ఆమె కుండలు అమ్మే అమ్మాయిని (Pot seller) మోడల్ గా మార్చిన వీడియో చాలా మందికి నచ్చింది. ఆమె ఇలాంటి వ్యక్తులను గౌరవిస్తున్నందుకు ప్రశంసిస్తున్నారు. ‘ఈ మార్పు చాలా బాగుంది’ అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.