https://oktelugu.com/

Bird flu : బర్డ్ ఫ్లూ భయం.. నాటు కోడి తినాలనే ఉబలాటం.. చివరికి ఏం జరిగిందంటే..

భూమ్మీద నూకలు ఉంటే.. చివరి దశలోనూ లేచి వస్తారు అంటారు. ఈ మాటలు నిజం చేసే సంఘటన జరిగింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది.

Written By: , Updated On : February 18, 2025 / 03:00 AM IST
Bird flu Effect

Bird flu Effect

Follow us on

Bird flu : బర్డ్ ప్లూ(bird flu) ప్రస్తుతం తీవ్రంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో బ్రాయిలర్ కోళ్లు (broiler hens) కన్నుమూశాయి. దీంతో బ్రాయిలర్ చికెన్ తినేవారు పూర్తిగా తగ్గిపోయారు. షాపులు కూడా వినియోగదారులు లేక వెలవెల బోతున్నాయి. ఈ క్రమంలోనే మాంసాహార ప్రియులు మటన్, ఫిష్, రొయ్యలు కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మటన్ ధర విపరీతంగా పెరిగింది. గతంలో కిలో మటన్ 800 కు లభ్యం కాగా.. ఇప్పుడు దాని ధర ఏకంగా వెయ్యి రూపాయలకు చేరుకుంది. చేపలకు కూడా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 150 రూపాయలకు లభ్యమయ్యే కిలో చేపలు ప్రస్తుతం 200 దాకా పలుకుతున్నాయి. ఇక రొయ్యల ధరలు కూడా చుక్కల్లో విహరిస్తున్నాయి. గతంలో రొయ్యల ధర కిలో 350 ఉండగా.. ప్రస్తుతం అది 400కు చేరుకుంది. ఇక మిగతా జంతువుల మాంసాల ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయినప్పటికీ ముక్క ప్రియులు తగ్గేదే లేదు అన్నట్టుగా మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే బర్డ్ ఫ్లూ అనేది కేవలం బ్రాయిలర్ కోళ్లకు మాత్రమే వస్తోంది. దీంతో చాలామంది బ్రాయిలర్ కోళ్లను వదిలిపెట్టి నాటు కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. అలా నాటుకోడిని కొనుగోలు ఓ వ్యక్తి తీరా కోసి.. దాని ఈకలు పీకుతున్న క్రమంలో.. అనుకోని ఘటన అతడి ఆశలను అడియాసలు చేసింది.

పారిపోయింది

బర్డ్ ఫ్లూ వల్ల బ్రాయిలర్ చికెన్ తినడానికి భయపడిన ఓ వ్యక్తి.. నాటుకోడిని కొనుగోలు చేశాడు. దానిని ఓ వ్యక్తి దగ్గర ఓ మత సంప్రదాయ విధానంలో కోసుకొని వచ్చాడు. అయితే ఆ సాంప్రదాయంలో మెడను పూర్తిగా కోయరు. అయితే అలా కోసుకుని వచ్చిన తర్వాత.. దాని ఒంటిపై ఉన్న ఈకలను పీకి శుభ్రం చేస్తుండగా.. ఒక్కసారిగా ఆ కోడి పారిపోయింది.. దీంతో ఆ వ్యక్తి షాక్ కు గురయ్యాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ” బ్రాయిలర్ చికెన్ తినాలంటే భయపడిన ఆ వ్యక్తి.. నాటుకోడి కొనుగోలు చేశాడు. తీరా దానిని కోసే క్రమంలో అది పారిపోయింది. ఫలితంగా అతడు మొక్క తినకుండానే ఉండిపోవాల్సి వచ్చింది. పాపం అతడికి ముక్క తినాల్సిన అదృష్టం లేకుండా పోయింది. ఎంత ఖర్చు పెట్టి నాటుకోడిని కొనుగోలు చేశాడో తెలియదు. ఒంటిపై ఈకలు పీకినప్పటికీ ఆ నాటుకోడి పారిపోయిందంటే దానికి భూమి మీద నూకలు ఉన్నాయి.. అందుకే నాటుకోడిని కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. చివరికి ముక్కలు ఉడికి ప్లేట్లోకి వచ్చేదాకా నమ్మకం లేదని ” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.