https://oktelugu.com/

Viral Video : భార్యతో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే.. ఈ ఆణిముత్యాన్ని చూసి నేర్చుకోండి

సాధారణంగా భార్యలను భర్తలు పొగడం చాలా అరుదు. వందిమంది జంటల్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వాళ్ల భార్యలను పొగుడుతారు. అయితే తాజాగా ఓ భర్త తన భార్యను పొగుడుతున్నాడు. రోడ్డు పక్కన పార్క్ చేసిన కార్ ఎక్కడానికి ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఇలా నడుస్తూ భర్త.. తన భార్యను పొగుడుతున్నాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 29, 2024 / 02:29 AM IST

    Viral video

    Follow us on

    Viral Video : పెళ్లికి ముందు ఉండే లైఫ్ వేరే. కానీ పెళ్లి తర్వాత అన్ని మారిపోతాయి. మహిళలు భార్యగా మారిన తర్వాత కొత్తగా ప్రవర్తిస్తుంటారని చాలామంది భర్తలు అంటుంటారు. నిజానికి ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా పెళ్లయిన తర్వాత గొడవలు, అపార్థాలు తప్పవు. పెళ్లికి ప్రతి భర్తకు భార్య దేవతలా ఉంటుంది. అదే పెళ్లయిన తర్వాత దెయ్యంలా కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో భార్యాభర్తలకు సంబంధించి ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందరి లైఫ్‌లో జరిగిన విషయాన్నే చెప్పినట్లు అనిపిస్తుంది. అయితే తాజాగా ఓ భర్త చేసిన ఓ ఫన్నీ రీల్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు భర్త అంటే నీలా ఉండాలని అతన్ని పొగుడుతున్నారు. ఇంతకీ ఆ రీల్‌లో ఏం ఉంది? ఆ భర్త ఏమన్నాడు? పూర్తిగా తెలుసుకుందాం.

    సాధారణంగా భార్యలను భర్తలు పొగడం చాలా అరుదు. వందిమంది జంటల్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వాళ్ల భార్యలను పొగుడుతారు. అయితే తాజాగా ఓ భర్త తన భార్యను పొగుడుతున్నాడు. రోడ్డు పక్కన పార్క్ చేసిన కార్ ఎక్కడానికి ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఇలా నడుస్తూ భర్త.. తన భార్యను పొగుడుతున్నాడు. నా భార్య చాలా మంచిది. తను నన్ను అర్థం చేసుకుంటుంది. తనని నేను చాలా గౌరవిస్తాను. తను అంటే నాకు చాలా ఇష్టమని చెబుతుంటాడు. అలా ప్రేమగా మాట్లాడుతూ.. కార్ డోర్ తీసి మరి ఆమెను ఎక్కిస్తాడు. ఆమె కార్ ఎక్కిన వెంటనే తన భార్యపై ఉన్న ఒరిజినల్ ఫీలింగ్‌ను చెబుతాడు. డోర్ క్లోజ్ చేసిన వెంటనే తన బాధను షేర్ చేసుకుంటాడు. తన భార్యకు అతను చెప్పింది వినిపించదని తన భార్య గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు.

    డ్రైవర్ సీట్ లోకి వచ్చి కూర్చోనే లోపు ఆ భర్త తన ఫీలింగ్స్ అన్నింటిని కూడా షేర్ చేసుకుంటాడు. తన భార్యకు ఎలాగో వినిపించదని నచ్చినట్లు మాట్లాడతాడు. భార్యతో పూర్తిగా విసిగిపోయానని.. తనని భరించలేకపోతున్నానని వీడియోలో అంటాడు. ఆమెను భరించడం కంటే కారులో అతివేగంగా వెళ్లి డోర్ ఓపెన్ చేసి చనిపోవడం మేలని అంటాడు. తనకు ఎలాగో వినిపించదని డ్రైవర్ సీటుకు వెళ్లే వరకు తన బాధను చెప్తాడు. ఇంతలో డ్రైవర్ సీటు రాగానే మళ్లీ భార్యను చూపిస్తూ ఆమెను పొగిడాడు. భార్య ఉంటే ఒకలా.. లేకపోతే ఒకలా ఉంటున్నాడు. దీంతో నెటిజన్లు అతన్ని పొగుడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు.. ఎక్కడ.. ఏం మాట్లాడాలి అనే విషయం తెలిసుండాలి. భార్యతో ఎలా ఉండాలో ఆ భర్తకు బాగా తెలుసు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే అతన్ని చూసి నేర్చుకోవాలి. ఇది హ్యాపీ లైఫ్‌కి సీక్రెట్ అని అంటున్నారు. కానీ కొందరు ఇప్పుడు అసలైన ఫైట్ మొదలవుతుందని కామెంట్ చేస్తున్నారు. మరి మీరు మీ భార్యతో ఎలా ఉంటున్నారో కామెంట్ చేయండి.