Viral video: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. బెండకాయ ముదిరినా.. బ్రహ్మచారి ముదిరినా పెద్ద ఉపయోగం ఉండదు. కానీ ప్రస్తుత కాలంలో పల్లెలు, ఓ మాదిరి మండలాలు మినహాయిస్తే.. పట్టణాలు, నగరాలలో యువతీ యువకులు కెరియర్ సాకుగా చూపించి త్వరగా పెళ్లిలు చేసుకోవడం లేదు. మరికొన్నిచోట్ల అబ్బాయిలకు సరిపడా అమ్మాయిలు లేకపోవడంతో వారికి పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో సమాజపరంగా అంతరం ఏర్పడుతోంది. ఇది అంతిమంగా సమాజంపై ప్రభావం చూపిస్తోంది. ట్విట్టర్లో తెగ విస్తృతిలో ఉన్న ఒక వీడియో.. నవ్వులు పూయిస్తున్నప్పటికీ.. సమాజంలో చోటు చేసుకుంటున్న అంతరాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.
ముదురు వయసులో పెళ్లి చేసుకుని..
ట్విట్టర్లో తెగ సర్కులేట్ అవుతున్న వీడియో ప్రకారం.. 40+ వయసులో ఉన్న ఓ వ్యక్తికి పెళ్లి నిశ్చయమైంది. అతడి పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అతని భార్య కూడా దాదాపుగా 35 వయసులో ఉంది. వీరిద్దరూ తన పెళ్లి వేడుకలకు సంబంధించి హల్ది కార్యక్రమాన్ని నిర్వహించారు. పెళ్లికూతురుకు బంధువులు మంగళ స్నానం చేయిస్తుండగా.. పెళ్ళికొడుకు తోటి బంధువులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి కుమారుడి వయసు మళ్లడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.” ముదురు వయసులో పెళ్లి.. పైగా రీల్స్ చేస్తున్నారు..ఇదేం పిచ్చి” అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మరికొందరు మద్దతుగా..
“అతడు సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి కాదు కాబట్టి.. అందరూ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే అతడు ఓ క్రీడాకారుడో, సినిమా యాక్టరో అయితే ఇలాగే కామెంట్ చేస్తారా. అతడికి వయసు వచ్చినప్పుడు పెళ్లి కాలేదు. ఎందువల్ల కాలేదో తెలియదు. ఆ మాత్రం దానికి అతడిని ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక మనిషికి తోడు కావాలి. ఆడకు మగ, మగకు ఆడ కచ్చితంగా కావాలి. అతడికి ఈ వయసులో తోడు దొరికింది. సంతోషంగా ఎగిరి గంతులు వేస్తున్నాడు. చూస్తే చూడండి.. లేకపోతే మానేయండి. అంతేతప్ప ముదురు వయసులో పెళ్లి చేసుకున్నాడని.. ముదనష్టపు రీల్స్ చేస్తున్నాడని కామెంట్ చేయకుండానే” కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఈ వీడియో ట్విట్టర్ ఎక్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే వేలల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. అతడు ఈ వయసులో పెళ్లి చేసుకోడాన్ని కొంతమంది తప్పు పడుతుండగా.. మరి కొంతమంది సమర్థిస్తున్నారు. మొత్తానికి ఒక ఇంటివాడు అవుతున్నాడని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సంసార జీవితం బాగుండాలని శుభకామనలు అందిస్తున్నారు. ” నీ జీవితం నీ ఇష్టం. ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. నీ ఆనందాన్ని అడ్డుకునే అధికారం ఎవరికి లేదు. ఎవరెవరో ఏవేవో మాట్లాడుతుంటారు. వారందరిని పట్టించుకోకు. ఎందుకంటే వారెవరూ నీ జీవితాన్ని నిర్దేశించలేరు. నువ్వు కష్టాల్లో ఉంటే ఆదుకోలేరు. జస్ట్ వాళ్లు టైంపాస్ పల్లిల్లాంటి వ్యక్తులు” అని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ముదురు వయసులో పెళ్లి చేసుకుంటా ఈ ముదనష్టపు రీల్స్ ఏంటో …. pic.twitter.com/NzAunlo0md
— Nani (@Ravanaroy) August 13, 2024