https://oktelugu.com/

Kitchen Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. ఈజీగా వెల్లుల్లి తొక్క తీయవచ్చు.. వైరల్ వీడియో

వెల్లుల్లి తొక్క తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించి తొక్క తీస్తే ఈజీ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మరి ఈజీగా వెల్లుల్లి తొక్క తీయడం ఎలాగో తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదవండి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 5, 2024 / 03:36 AM IST

    Kitchen Tips

    Follow us on

    Kitchen Tips :  వెల్లుల్లి గురించి మనందరికీ పరిచయమే. దీనిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా అన్ని కూరలు, చట్నీలు, పచ్చళ్లుకి అధికంగా ఉపయోగిస్తారు. అసలు వెల్లుల్లి లేకపోతే వంటల్లో రుచి కూడా మారిపోతుంది. అయితే వెల్లుల్లి కేవలం వంటల్లో రుచి కోసం మాత్రమే కాకుండా.. ఆరోగ్యం కోసం కూడా వాడుతారు. వెల్లుల్లి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి తింటే డయాబెటిస్ కంట్రోల్ కావడంతో పాటు బాడీలో ఉండే విష పదార్థాలను బయటికి పంపుతుంది. అలాగే బాడీలో ఉండే కొవ్వు కూడా తగ్గుతుంది. కాకపోతే వెల్లుల్లిని పరగడుపున తింటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అందుకే కొంతమంది వెల్లుల్లి డైరెక్ట్ గా లేదా కూరలు, రసంలో ఉన్నవి అయిన తింటారు. ఇది తినడం సంగతి పక్కన పెడితే.. ఫస్ట్ వెల్లుల్లి తొక్క తీయడమే ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే వెల్లుల్లి తొక్కను గోల తో తీసేటప్పుడు చాలా నొప్పి వస్తుంది. ఏదో ఒకటి లేదా రెండు అయితే తీసేయొచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి తొక్క తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించి తొక్క తీస్తే ఈజీ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మరి ఈజీగా వెల్లుల్లి తొక్క తీయడం ఎలాగో తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదవండి.

    అలాంటి నొప్పి లేకుండా వెల్లుల్లి తొక్కలను ఈజీగా తీయాలంటే.. వాటిని కొంతసేపు వేడి చేసుకోవాలి. మైక్రోవేవలో లేదా గ్యాస్ మీద అయిన కొంత సేపు వేడి వేడిచేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిని బయటకు తీసి.. తొక్క తీస్తే ఈజీగా వచ్చేస్తాది. చేతులకి ఎలాంటి నొప్పి లేకుండా సింపుల్ గా వచ్చేస్తాది. ఇలా కాకుండా వెల్లుల్లి పాయను టేబుల్ పైన పెట్టి చేతితో గట్టిగా నొక్కాలి. ఆ తర్వాత ఆ వెల్లుల్లిపాయను ఒక బాక్స్ లో వేసుకొని.. ఆ డబ్బా ని గట్టిగా కిందకి మీదకి కలపాలి. ఇలా చేస్తే ఆటోమేటిక్ గా వెల్లుల్లి పాయ తొక్కలు వచ్చేస్తాయి. అలాగే వెల్లుల్లిపాయకు నూనె రాసి కొంతసేపు ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత పొట్టు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. కొంతమంది వెల్లుల్లిపాయను అడ్డంగా కోసి చాకుతో ప్రెస్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఒక్కసారి వెల్లుల్లి పాయలుకు ఉన్న తొక్కలు వచ్చేస్తాయి. అయితే వెల్లుల్లి తొక్క అవసరం లేదని చాలా మంది తీసేస్తారు. కానీ ఇందులోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయని ఔషధ నిపుణులు చెబుతున్నారు. ఈ తొక్కలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా వంటి లక్షణాలు నిండుగా ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ముఖంపై ఉండే మొటిమలు తగ్గించడంతో పాటు స్కిన్ కాంతివంతంగా ఉండేలా సాయపడుతుంది. అలాగే జుట్టులో చుండ్రు వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కాబట్టి వెల్లుల్లి తొక్కను పడేయకుండా ఆహారంలో తినడం మంచిది.