https://oktelugu.com/

Viral Video: భార్యల సీటు కోసం బస్సులో కొట్టుకున్న భర్తలు..!

తొర్రూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు తొర్రూరు నుంచి ఉప్పల్‌ క్రాస్‌రోడ్డు వెళ్లేందుకు ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండడంతో సీట్లు ఆపుకున్న వారు బస్సులోకి ఎక్కారు.

Written By: , Updated On : April 24, 2024 / 11:01 AM IST
Viral Video

Viral Video

Follow us on

Viral Video: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలులోకి వచ్చాక.. తెలంగాణ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒకచోట గొడవలు జరుగుతున్నాయి. చాలా చోట్ల మహిళలే సీటు కోసం జుట్లు పట్టుకున్న ఘటనలు అనేకం చూశాం. అయితే తాజాగా భార్యల సీటు కోసం భర్తలు ఏకంగా చెప్పులతో కొట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం(ఏప్రిల్‌ 23న) సాయంత్రం తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగింది.

ఏం జరిగిందంటే..
తొర్రూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు తొర్రూరు నుంచి ఉప్పల్‌ క్రాస్‌రోడ్డు వెళ్లేందుకు ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండడంతో సీట్లు ఆపుకున్న వారు బస్సులోకి ఎక్కారు. తాము ఆపుకున్న సీట్లో వేరేవారు కూర్చోవడంతో తాము సీటు ఆపామని ఇద్దరు మహిళా ప్రయాణికులు గొడవ పడ్డారు. ఇది గమనించిన వారి భర్తలు బస్సులోకి ఎక్కారు.

చెప్పులతో దాడి..
తమ భార్యలు సీటు కోసం పరస్పరం గొడవ పడుతుండడంతో భర్తలు జోక్యం చేసుకున్నారు. దీంతో గొడవ పెద్దదైంది. ఏకంగా చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు జోక్యం చేసుకుని ఇద్దరినీ కిందకు దించేశారు. అయినా వారి గొడవ ఆగలేదు. కిందకు దిగాక కూడా భర్తలిద్దరూ కొట్టుకున్నారు. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది 100కు డయల్‌ చేశారు. పోలీసులు వచ్చి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.