Goa : గోవాలోని ప్రతి బీచ్ లో వేడుకలు ఉత్సాహంగా జరుగుతుంటాయి. నైట్ పార్టీలలో సందడి తారా స్థాయికి చేరుతుంది. ఈ పార్టీలకు హాజరు కావడానికి ఎక్కడెక్కడ నుంచో పర్యాటకులు వస్తుంటారు. ఆకాశమే హద్దుగా సందడి చేస్తుంటారు. మరి కొంతమంది బీచ్ ఒడ్డున కూర్చుని సముద్రాన్ని చూస్తూ.. అక్కడ రకరకాల సాహస క్రీడలలో పాలుపంచుకుంటారు. సముద్ర ప్రాంతం కాబట్టి ఇక్కడ రకరకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. సీ ఫుడ్ లో ప్రపంచ స్థాయిలో ఉంటుంది. పైగా ఇక్కడ పోర్చుగీస్ తరహాలో భవనాలు ఉంటాయి. పేరుకు గోవా ఇండియా లో ప్రాంతమైనప్పటికీ ఇక్కడ పాశ్చాత్య సంస్కృతి కనిపిస్తుంది. మద్యం ధరలు ఇక్కడ తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఇక్కడ పార్టీ కల్చర్ కనిపిస్తుంది కాబట్టి.. పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. విదేశాల నుంచి కూడా భారీగా వస్తూ ఉంటారు. గోవా చిన్న రాష్ట్రం కాబట్టి.. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయమే ఈ రాష్ట్రానికి ప్రధాన వనరు. అందువల్లే ఇక్కడ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం విస్తృతంగా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కాటేజీలు, రిసార్టులు, రెస్టారెంట్లు ఉంటాయి. ప్రైవేట్ ఆధ్వర్యంలో కూడా ఇదే స్థాయిలో ఉంటాయి.
ఈ ఏడాది కళ తప్పింది
సాధారణగా డిసెంబర్ 31 నైట్ వేడుకలు గోవాలో అంబరాన్ని అంటే విధంగా సాగుతుంటాయి. ప్రత్యేకంగా ఈ వేడుకల కోసం ఎక్కడెక్కడ నుంచో పర్యాటకులు గోవా వస్తూ ఉంటారు. పర్యాటకుల తగ్గట్టుగా ఇక్కడికి హోటల్స్ ప్రత్యేక ఆఫర్లు పెడుతుంటాయి. రాత్రి మొత్తం పర్యాటకులు చిల్ అయ్యేవిధంగా రకరకాల ఏర్పాట్లు చేస్తుంటాయి. మద్యం, వంటకాలు, ప్రత్యేకంగా గడిపేందుకు గదులు వంటి అనుభూతులను పర్యాటకు ఇస్తుంటాయి. అయితే గోవాలో ఈసారి పరిస్థితి విరుద్ధంగా మారింది. పర్యాటకులతో సందడిగా ఉండాల్సిన గోవా ప్రాంతం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. పర్యాటకులు లేక రెస్టారెంట్లు, రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. గతంలో నూతన సంవత్సర వేడుకల ముందు హోటళ్లు కిటకిటలాడేవి. రూములు కూడా దొరకపోయేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. మన దేశానికి పక్కనే ఉన్న బాలి, థాయిలాండ్, వియత్నాం వంటి దేశాలకు ఫ్లైట్ టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. గోవా కైతే ఫ్లైట్ టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు ఈ ప్రాంతంలో మోసాలు ఇటీవల పెరిగాయి. పర్యాటక సేవలు గతంలో మాదిరిగా లేవు. దీంతో ఇక్కడికి రావాలంటేనే పర్యాటకులు భయపడుతున్నారు. ఇక స్థానికంగా ఉన్న రిసార్ట్లు కూడా ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడంతో.. అక్కడిదాకా వెళ్లడం ఎందుకని చాలామంది గోవా రావడానికి విముఖత ప్రదర్శిస్తున్నారు. పర్యాటకులు రాకపోవడంతో తమ వ్యాపారాలు మొత్తం పడిపోయాయని గోవాలోని స్థానికులు వాపోతున్నారు. ” గతంలో చేతినిండా వ్యాపారాలు జరిగేవి. మాకు లాభాలు కూడా భారీగానే వచ్చేవి. ఈసారి పరిస్థితి మారిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈసారి మాకు భారీ నష్టాలు తప్పేలా లేవని” గోవాలోని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు
డిసెంబర్ 31 వేడుకల వేళ గోవా కళ తప్పింది. పర్యాటకులు లేకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రెస్టారెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి..#GOA#2025newyear#dec312024 pic.twitter.com/ixNhCEo8gl
— Anabothula Bhaskar (@AnabothulaB) December 30, 2024