https://oktelugu.com/

Uttar Pradesh : ముద్దిస్తేనే అటెండెన్స్.. వామ్మో ఈ హెడ్ మాస్టర్ మాములు చిలిపి కాదు.. వీడియో వైరల్

ఆ ఉపాధ్యాయురాలు అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుంటుండగా.. ఆమెను వారించిన ప్రధానోపాధ్యాయుడు.. ఆ రిజిస్టర్ తన వద్ద పెట్టుకున్నాడు. కొంటెగా ఓ చూపు చూసి.. ఓ నవ్వు నవ్వాడు.. తన చేతిలో ఉన్న పెన్నును బుగ్గ మీద పెట్టుకొని.. ఒక ముద్దు ఇస్తేనే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టనిస్తానని.. లేకపోతే ఆబ్సెంట్ వేస్తానని అన్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 9, 2024 / 05:20 PM IST
    Follow us on

    Uttar Pradesh : తల్లిదండ్రుల తర్వాత స్థానం ఉపాధ్యాయుడిది. ఒక విద్యార్థి కి చదువు మాత్రమే కాదు, నడవడిక, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యతను నేర్పుతాడు. అందుకే ఆచార్యదేవోభవ అనే సూక్తి పుట్టింది. నేడు ఉన్నత స్థానాలలో ఉన్నవారు మొత్తం ఒకప్పుడు ఉపాధ్యాయుల వద్ద చదువుకున్నవారు. వారిచేత బెత్తం దెబ్బలు తిన్నవారే. సమాజాన్ని నిర్దేశిస్తారు కాబట్టే ఉపాధ్యాయులను అందరూ గౌరవిస్తారు. గొప్పగా చూస్తారు. అయితే అలాంటి గౌరవప్రదమైన వ్యక్తికి ఉపాధ్యాయుడు కళంకం తెచ్చాడు. ఏకంగా తోటి ఉపాధ్యాయురాలితో తన వక్రబుద్ధిని బయట పెట్టుకున్నాడు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ ఉపాధ్యాయుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

    సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం..

    సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ పాఠశాలలో ఓ ప్రధానోపాధ్యాయుడు తన కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఈలోగా ఉపాధ్యాయురాలు ఆయన గదిలోకి వచ్చింది. అప్పటికి పాఠశాలలో ప్రార్థన ముగిసింది. తరగతులు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు ఎవరికి కేటాయించిన పీరియడ్ కు వారు వెళ్ళిపోయారు. ఈలోగా ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయురాలు సంతకం పెట్టేందుకు ప్రధానోపాధ్యాయుడి గదికి వెళ్ళింది. తన కుర్చీలో కూర్చున్న ప్రధానోపాధ్యాయుడు ఆమె వైపు అదోలా చూశాడు. ఆమె అతడికి నమస్కారం పెట్టింది. అతడు ప్రతి నమస్కారం చేయకుండా తన పనిలో తానున్నాడు. ” సార్ అనుకోకుండా ఆలస్యమైంది. క్షమించండి. అటెండెన్స్ రిజిస్టర్ ఇస్తే సంతకం పెడతాను. నా పీరియడ్ నేను చూసుకుంటానని” ఆ ఉపాధ్యాయురాలు ఆ ప్రధానోపాధ్యాయుడితో చెప్పింది. అయితే దీనికి అతడు అవును అని గాని కాదు అని గాని సమాధానం చెప్పలేదు. ఆమె చొరవతో రిజిస్టర్ తీసుకోబోతుండగా.. ఆ ప్రధానోపాధ్యాయుడు వారించాడు. ఈ పరిణామానికి ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.

    అది ఇస్తేనే..

    ఆ ఉపాధ్యాయురాలు అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుంటుండగా.. ఆమెను వారించిన ప్రధానోపాధ్యాయుడు.. ఆ రిజిస్టర్ తన వద్ద పెట్టుకున్నాడు. కొంటెగా ఓ చూపు చూసి.. ఓ నవ్వు నవ్వాడు.. తన చేతిలో ఉన్న పెన్నును బుగ్గ మీద పెట్టుకొని.. ఒక ముద్దు ఇస్తేనే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టనిస్తానని.. లేకపోతే ఆబ్సెంట్ వేస్తానని అన్నాడు. దీంతో ఆ ఉపాధ్యాయురాలు ఒక్కసారిగా షాక్ కు గురయింది. వెంటనే ఇది సరైన పద్ధతి కాదు సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్.. అంటూ అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. ఆమె చెప్పిన సమాధానానికి ఆ ప్రధానోపాధ్యాయుడు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. పైగా ముద్దు ఇస్తేనే సంతకం పెట్టనిస్తానని మరోసారి గట్టిగా చెప్పాడు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే దీనిని ఎవరో వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆ ప్రధానోపాధ్యాయుడిపై దుమ్మెత్తి పోస్తున్నారు. బాధ్యతగా ఉండాల్సిన వృత్తిలో ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు. కాగా, ఆ ప్రధానోపాధ్యాయుడి వ్యవహారం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ కావడంతో.. అది కాస్త ఉత్తర ప్రదేశ్ విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వీడియోను ప్రధాన సాక్ష్యంగా చూపిస్తూ అతడికి షోకాజ్ నోటీస్ చారి చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు అతడిని సస్పెండ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాంటి వ్యక్తి ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకొస్తున్నాడని మండిపడుతున్నాయి. అయితే ఈ వీడియోను పదేపదే టెలికాస్ట్ చేయడంతో ఆ ప్రధానోపాధ్యాయుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.