Corona Lockdown Video : కరోనా కారణంగా 2021 మార్చి 22న ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ మొదలైంది. తర్వాత నెలల పాటు లాక్‌డౌన్ కొనసాగింది. మాస్కులు, శానిటైజర్లు, ఐసోలేషన క్వారంటైన్, భౌతిక దూరం వంటివాటితో జీవితం కొత్తగా మారింది. లాక్‌డౌన్‌తో ప్రజలు నెలల తరబడి ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది. లాక్‌డౌన్ కారణంగా చాలా మంది వర్క్‌ఫ్రం హోంకు అలవాటు పడ్డారు. కొందరు డీలాపడ్డవారిని ఉత్తేజ పరిచేలా వీడియోలు చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఖాళీ సమయం దొరకడంతో చాలా మంది తమలోని క్రియేటివిటీని బయట పెట్టారు. ఇక కొందరు తమ ఇబ్బందులను తెలియజేస్తూ వీడియోలు చేశారు. కొందరు కరోనా సోకినవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం, మందుల గురించి తెలిపేలా వీడియోలు చేశారు. చాలా మంది డాక్టర్లు కోవిడ్ పేషెంట్స్‌కు సూచనలు చేశారు. ఇలాగే ఓ వ్యక్తి లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉండడంతో పడుతున్న ఇబ్బంది గురించి తన మిత్రుడు ఉమేశ్‌కు తెలిసేలా ఓ వీడియో చేశాడు.
అప్పట్లో వైరల్..
ఓ వ్యక్తి లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉండం ఎంత కష్టంగా ఉందో వీడియోలో వివరించాడు. తన బాధను మిత్రుడు ఉమేశ్‌కు తెలిపేలా వీడియో చేశాడు. ఇందులో భార్య ముందు ఒక్క రోజు ఉండడమే కష్టంగా ఉంటుంది. పది రోజులు ఇంట్లోనే ఉండాలంటే ఎలా అంటూ మిత్రుడిని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి ఉందా అని ప్రశ్నించాడు. 31 వరకు ఇంట్లోనే ఉండాలంటే ఎలా అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తన బాధను అర్థం చేసుకోవాలని ఉమేశ్‌ను వేడుకున్నాడు. ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. భర్తల తరఫున వాట్సాప్‌లలో పోస్టులు పెట్టే ఉమేశ్ తనకు ఏదైనా సలహా ఇవ్వాలని వేడుకున్నాడు.
మూడేళ్ల తర్వాత మళ్లీ..
నాటి వీడియో తాజాగా మళ్లీ వైరల్ అవుతోంది. నాడు ఉమేశ్‌కు చెప్పుకున్న బాధను మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. ఉమేశ్ దొరికాడా మరి అని అడుగుతున్నారు. ఉమేశ్ సలహా ఇచ్చాడా.. భార్య ముందు ఉండకుండా ఎలాంటి చూచనలు చేశారని పలువురు నెటిజన్లు ఆసక్తిగా అడుగుతున్నారు. దీంతో మరోమారు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఉమేశ్ గిట్లనే ఉంటదా.. అతను ఏం పాపం చేశాడు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కొందరు నాటి పరిస్థితిని గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నారు.
అనేక వీడియోలు..
ఇదిలా ఉంటే.. నాటి లాక్‌డౌన్ కాలంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్వారంటైన్‌లో పాటలు, అంత్యాక్షరి ఆటలు, డాన్సులకు సంబందించిన వీడియోలు చాలా వచ్చాయి. కొందరు క్వారంటైన్‌లో పాటలు వినడం, సంగీతం లాంటివి వాయించడం చేస్తూ వీడియోలు చేశారు. ఇక మొక్కలు కూడా మనుషుల్లా కదులుతాయని అనే వీడియో ఏకంగా 90 లక్షల వ్యూస్ వచ్చాయ. ఇలా అనేక వీడియోలు నాడు వైరల్ అయ్యాయి. కోవిడ్ బాధితులకు ఉపశమనం కలిగించాయి. లాక్‌డౌన్ సమయంలో టైం పాస్ చేశాయి.
కరోనా లాక్ డౌన్ లో చాలా వైరల్ వీడియో ఇది.
ఆ ఉమేష్ దొరికిండో లేదో మరి.. pic.twitter.com/3CwUpmnhSB
— (@Sagar4BJP) December 18, 2024