Viral Video : నాటుకోడిని పట్టడం ఓ కళ.. అయితే అందులో ఇతడు పీహెచ్ డీ చేశాడు.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి నాటుకోడి పట్టేందుకు మాయాజాలాన్ని ప్రదర్శించాడు. తన తన జిహ్వ చాపల్యాన్ని తీర్చుకునేందుకు నాటుకోడిని తన బుట్టలో వేసుకున్నాడు. ఓ మైదాన ప్రాంతంలో మేతమేస్తున్న నాటుకోడికి పక్కనే ఉన్న ఓ వ్యక్తి.. ఏమాత్రం అలికిడి చేయకుండా మెల్లగా దాని వైపు వెళ్ళాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 5, 2024 7:20 pm
Follow us on

Viral Video :  ఇప్పుడంటే బ్రాయిలర్, లేయర్ చికెన్ లొట్టలు వేసుకుంటూ తింటున్నాం. రోజుతో సంబంధం లేకుండా.. ముక్క లేనిదే ముద్ద దిగని స్థాయికి వచ్చేసాం. అయితే చికెన్ బిర్యాని, లేకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్, ఇంకా స్థోమతను బట్టి రకరకాల వెరైటీలను లాగించేస్తున్నాం. స్థూలంగా చెప్పాలంటే బ్రాయిలర్, లేయర్ చికెన్ తో విడదీయరాని సంబంధాన్ని పెంచేసుకున్నాం. అంతకంతకూ చికెన్ తినే సందర్భాన్ని విస్తరిస్తున్నాం గానీ.. చికెన్ తినడాఎన్ని మాత్రం తగ్గించుకోలేకపోతున్నాం. డాక్టర్లు చెబుతున్నప్పటికీ, పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ చికెన్ వాడకం తగ్గడం లేదు. పైగా ఇందులోను చికెన్ లో కొత్త కొత్త రుచులు తెరపైకి వస్తుండడంతో తినే వారి సంఖ్య మరింత పెరుగుతోంది. అయితే ఒకప్పుడు పరిస్థితి ఇలా లేదు. బ్రాయిలర్ చికెన్ ఎక్కడో నగరాలకు మాత్రమే పరిమితమే ఉండేది. మండలాలు, మామూలు పట్టణాలలో బ్రాయిలర్ చికెన్ లభ్యమయ్యేది కాదు. అయితే అప్పట్లో నాటు కోళ్లు విపరీతంగా ఉండడంతో జనం వాటినే తినేవారు. ఇప్పట్లో కాకుండా పండగలు, పబ్బాల సమయంలోనే నాటుకోళ్లను కోసుకొని తినేవారు.

తినే వారి సంఖ్య పెరిగింది

నానాటికి చికెన్ వినియోగం పెరగడంతో అప్పట్లో బ్రాయిలర్, లేయర్ కోళ్లను సృష్టించారు. ఈలోపు నాటు కోళ్ల వినియోగం తగ్గడం.. బ్రాయిలర్, లేయర్ వినియోగం పెరగడం.. బ్రాయిలర్, లేయర్ కోళ్ల పెంపకం విస్తరించడంతో చికెన్ తినే వారి సంఖ్య పెరిగింది. అయితే కార్యక్రమంలో బ్రాయిలర్, లేయర్ కోళ్ల పెంపకంలో మందులు వాడుతున్న నేపథ్యంలో.. వీటిని తినేవారి లో మార్పు మొదలైంది. దీంతో చికెన్ ప్రియులు తిరోగమనాన్ని మొదలుపెట్టారు. నాటు కోళ్లను ఇష్టంగా తినడం ప్రారంభించారు. ఫలితంగా నాటుకోడి ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం కిలో నాటుకోడి వచ్చేసి గ్రామాల్లో 350, పట్టణాలలో 400, నగరాలలో 450 దాకా పలుకుతోంది. పేరు పొందిన హోటళ్ళల్లో ప్రత్యేకంగా నాటుకోడి డిష్ లు సర్వ్ చేస్తున్నారు. నాటు కోళ్లు బ్రాయిలర్, లేయర్ మాదిరిగా వేగంగా పెరగలేవు. తక్కువలో తక్కువ ఒక కోడి కిలో నుంచి కిలోన్నర సైజుకు రావాలంటే నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. డాక్టర్లు కూడా సూచించడం, కోవిడ్ తర్వాత తినే వాళ్ళు పెరగడంతో నాటు కోళ్లకు డిమాండ్ పెరిగింది.

మాయాజాలం ప్రదర్శించాడు

సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి నాటుకోడి పట్టేందుకు మాయాజాలాన్ని ప్రదర్శించాడు. తన తన జిహ్వ చాపల్యాన్ని తీర్చుకునేందుకు నాటుకోడిని తన బుట్టలో వేసుకున్నాడు. ఓ మైదాన ప్రాంతంలో మేతమేస్తున్న నాటుకోడికి పక్కనే ఉన్న ఓ వ్యక్తి.. ఏమాత్రం అలికిడి చేయకుండా మెల్లగా దాని వైపు వెళ్ళాడు. అటు ఇటు పరిసరాలను గమనించి ఒక్కసారిగా ఆ నాటుకోడిని పట్టుకున్నాడు. ఈ వీడియోను BaMatero అనే ఇన్ స్టా గ్రామ్ ఐడీలో అప్ లోడ్ చేయగా.. మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. “సాధారణంగా నాటు కోళ్లను పట్టడం అంత సులభం కాదు. కానీ ఇతడు అందులో పీహెచ్డీ చేశాడంటూ” వీడియోను చూసిన నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆ వీడియో ను ఆఫ్రికా దేశంలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. అక్కడి పరిసరాలు కూడా ఆ ఖండాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆ కోడి కూడా చూసేందుకు చాలా విచిత్రంగా ఉంది. అయినప్పటికీ ఆ వ్యక్తి దానిని దర్జాగా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలియదు గాని.. అత్యంత సులువుగా దాన్ని పట్టుకొని వారెవ్వా అనిపించాడు.