Viral Video : మన ఇండియాలో అయితే ఎండా కాలంలో అధిక వేడి ఉంటుంది. ఇది చల్లారడానికి వర్షాకాలం వరకు ఆగాల్సిందే. అయితే అంతలోపై అధిక వేడి కారణంగా ఈదురు గాలులు వీస్తాయి. ఈ క్రమంలో వర్షం కూడా పడుతుంది. కానీ కొన్ని దేశాల్లో తుపాన్లు, మరికొన్ని దేశాల్లో టోర్నడోలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇటీవల చైనాలో ఎండలు మండిపోతున్నాయి. నీరు దొరకక అల్లాడుతున్నారు. దీంతో వారి ప్రయోగం ద్వారా కృత్రిమంగా మేఘాలను కరిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంతలో అక్కడ భారీగా గాలులు వీస్తున్నాయి. ఈ సందర్భంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ‘లో దుస్తుల తుఫాన్’ అని పేర్కొంటున్నారు. లో దుస్తుల తుఫాన్ అని ఎందుకు అంటున్నారు. అసలేం జరిగింది?
భారీగా ఈదులుగాలులు వీయడం వల్ల స్థానికంగా ఉన్న తేలిక పాటి వస్తువులు గాల్లోకి లేస్తాయి. లేద చెట్టు విరిగిపోతాయి. కానీ చైనాలో వీచిన గాలులకు గాల్లో లో దుస్తులు కనిపించాయి. ఇవి ఎక్కువగా ఆడవారికి సంబంధించినవే ఉన్నాయి. లో దుస్తులతో కూడిన తుఫాను రావడంతో చాలా మంది ఆసక్తిగా చూశారు. కొందరు దీనిని ప్రపంచానికి తెలియజేయాలని వీడియో తీశారు. ఈ వీడియోలో వీస్తున్న గాలిలో లో దుస్తులే ఎక్కువగా ఉన్నాయి.అయితే ఇవి ఆకాశం నుంచి ఊడి పడ్డాయా? అని అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో NTE అనే సంస్థ ఈ వీడియోను షేర్ చేసింది. ఈ సందర్భంగా ‘9/2 underwear crisis’ అని ప్రత్యేకంగా పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే అండర్ వేర్ తుఫాన్ అని తెలుస్తోంది అని కొందరు కామెంట్ చేశారు. వాస్తవాన్ని పరిశీలించగా ఇవన్నీ అపార్ట్ మెంట్ బాల్కానీల్లో ఆరబెట్టినవి అని తేలింది. అయితే ఇన్ని లో దుస్తులు ఒకేసారి కొట్టుకు రావడం ఆసక్తిగా మారింది. అంతేకాకుండా మిగతా వస్తువుల కాకుండా కేవలం ఈ దుస్తులు కొట్టుకు రావడంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చైనాలో ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండవేడికి బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు. పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఒక్క వర్షం పడితే గానీ తమ పరిస్థితి ఆందోళనకరమే అని పలువురు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ఎండ బారి నుంచి తప్పించాలని కొందరు ప్రార్థిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ సమస్య నుంచి బయటపడడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది. మేఘాలను కృత్రిమంగా కరిగించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల కొంతైనా ఉపశమనం కలుగుతుందని భావిస్తోంది.
అయితే చైనాలో ఎక్కువ శాతం భవనాలు, ఫ్యాక్టరీలు ఉంటాయి. ఇక్కడ చెట్ల పెంపకం తక్కువగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ వర్షాభావం ఏర్పడిందని కొందరు అంటున్నారు. ఇందులో భాగంగా ఒక్క వాన వచ్చినా తాము ఈ క్రైసెస్ నుంచి బటయపడుతామని భావిస్తున్నారు. ముఖ్యంగా నీరు దొరకని ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం కృత్రిమ వర్షం కురిపిస్తుందా? లేక వరుణ దేవుడు కరుణిస్తాడా? అనేది చూడాలి.
Chongqing’s cloud-seeding to end a heatwave led to the “9/2 underwear crisis” as a windstorm scattered laundry across the city. With gusts up to 76 mph, bras and pants flew through the streets. Officials say the storm was natural, not caused by cloud-seeding. #Chongqing pic.twitter.com/pmKrvWOZSj
— NTE (@NoToEvils) September 9, 2024