Viral Video : హిందూ భక్తులు విపరీతంగా పూజిస్తుంటారు కాబట్టే హనుమంతుడికి ప్రతి ప్రాంతంలో కోవెల ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో హనుమంతుడు స్వయంభుగా వెలిశాడు. హనుమంతుడు నడియాడాడు అనే దానికి గుర్తుగా అనేక చారిత్రక ఐతిహ్యాలు ఉన్నాయి. తెలంగాణలో కొండగట్టు ప్రాంతంలో ఆంజనేయస్వామి స్వయంభుగా వెలిశాడు. ఇక ఏపీలో మద్దికొండ ప్రాంతంలోనూ ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిశాడని చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో ఆంజనేయ స్వామి ప్రతిమలను అనేక గ్రామాలలో ప్రతిష్టించారు. కాకపోతే వాటిని రాతిపై చెక్కించారు. ఆంజనేయస్వామి ఆలయాలను మొత్తం ఊరి పొలిమేరలలో నిర్మించారు. అలా నిర్మించడం వెనుక చారిత్రాత్మకమైన కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పొలిమేర ప్రాంతాల్లో ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మిస్తే.. అవి ఊరికి కాపలాగా ఉంటాయని.. రుగ్మతల నుంచి ప్రజలను కాపాడతాయని నాటి కాకతీయ ప్రభువులు నమ్మేవారు. అందువల్లే వారు ఆ పని చేశారు.. కాలక్రమంలో కాకతీయుల పరిపాలన ముగిసిన తర్వాత.. నవీన యుగం మొదలైన తర్వాత.. నాటి ఆలయాలు జీర్ణోద్దరణకు నోచుకున్నాయి. అవన్నీ భక్తుల రాకతో కళకళలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కొండగట్టు, మద్ది కొండ మాత్రమే కాకుండా.. ఇంకా చాలా ఆలయాలు ప్రాశస్త్యం పొందాయి.. అయితే ఇటీవల కాలంలో ఆంజనేయస్వామి ఆలయాలలోకి వానరాలు రావడం.. అక్కడ సందడి చేయడం పరిపాటిగా మారింది. అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం ఆంజనేయ స్వామికి వానరం పూజలు చేసింది. గద పట్టుకొని భక్తులను దీవించింది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
దైవికమైన సందర్భం
ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కీసరగుట్టలో శివలింగానికి ఓ వానరం వచ్చి పూజలు చేసింది. స్వామివారికి పూలు సమర్పించి.. రెండు చేతులతో నమస్కరించి ప్రణమిల్లింది. ఆ దృశం అప్పట్లో సంచలనంగా మారింది. వానరం అలా పూజలు చేస్తుండడాన్ని భక్తులు ఆసక్తిగా గమనించారు. తమ ఫోన్లలో ఆ దృశ్యాన్ని బంధించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వానరం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళింది. అక్కడ స్వామివారి పాదాల చెంత నిలుచుని ఉంది. చేతిలో గదతో స్వామి వారి పక్కనే ఆసీనమైంది. ఆ తర్వాత అక్కడ ఉన్న టెంకాయలను ఆరగించింది. ఆంజనేయ స్వామికి, వానరానికి దగ్గర పోలికలు ఉండడంతో భక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ వానరానికి బొట్టు పెట్టి, మెడలో పూలదండ వేసి పూజలు చేశారు. ఆ వానరం కూడా చేతిలో చిన్న గదను ధరించి భక్తులను దీవించింది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు, ఏ ప్రాంతంలో చోటు చేసుకుందో తెలియదు.. కాకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. హనుమంతుడు ఏదో సందేశం ఇవ్వడానికే ఇలా వానరాన్ని పంపించాడని.. స్వామివారు ప్రత్యక్షంగా తమ ముందుకు వచ్చి దీవించినట్టు ఉందని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.
దైవికమైన కొన్ని సందర్భాలను వర్ణించడం అసాధ్యం. అలాంటి వైరల్ వీడియో ఇది.. ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుట కూర్చున్న ఒక కోతి, గదను ధరించి అచ్చం హనుమంతుడిలాగే ఫోజులు ఇచ్చింది.. దీంతో భక్తులు దానికి పూజలు చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. pic.twitter.com/MSdNjexsJw
— Anabothula Bhaskar (@AnabothulaB) December 2, 2024