Viral Video : సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగరవేసేందుకు చాలా మంది చైనా మాంజాను ఉపయోగిస్తుంటారు. చైనా మాంజా అనేది గాజు సీసాలు, ఇనుప వస్తువుల మిశ్రమంతో తయారుచేస్తారు. ఈ మాంజా కూడా చాలా పదునుగా ఉంటుంది. ఇది మెడకు తగిలితే ప్రాణాలు పోతాయి. గత ఏడాది హైదరాబాదులో చైనా మాంజా తగిలి ఓ సైనికుడు కన్నుమూశాడు. అతడు తన భార్య పిల్లలను చూడడానికి సరిహద్దు నుంచి హైదరాబాద్ వచ్చాడు. సంక్రాంతి సందర్భంగా వారికి దుస్తులు కొనడానికి బయటికి వచ్చాడు. ఈ క్రమంలో అతడు బండిమీద వెళుతుండగా చైనా మాంజ అతడి మెడకు తగిలి తీవ్ర గాయం అయింది. స్థానికులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే కన్నుమూశాడు. ఇక చైనా మాంజా వల్ల చాలామంది గాయపడ్డారు. ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించినప్పటికీ.. అక్రమ మార్గంలో మన దేశానికి వస్తోంది. అందువల్లే సంక్రాంతి సమయంలో మనుషులు, పక్షులకు, జంతువులకు చైనా మాంజా వల్ల గాయాలు అవుతున్నాయి. చైనా మాంజ వల్ల ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
రక్షణ గోడ
చైనా మాంజా వల్ల బైకర్లు విపరీతంగా గాయపడుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అందువల్ల వారిని రక్షించడానికి పోలీసులు సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనికోసం ప్రత్యేక పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు.. బైకర్ల ప్రాణాలను రక్షించడానికి ఒక తీగను రక్షణ గోడగా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల మాంజా రైడర్ కు పగలకుండా ఉంటుంది. దీనిని ఎవరికి వారు ఏర్పాటు చేసుకుంటే పండుగ సమయంలో చైనా మాంజా నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చు. ” చైనా మాంజా అత్యంత ప్రమాదకరమైనది. గాజు సీసాల మిశ్రమం, ఇనుప తీగలతో తయారుచేస్తారు. అత్యంత సన్నగా ఉంటుంది. ఇది పొరపాటున మెడకు తగిలితే తీవ్రంగా గాయం అవుతుంది. రక్తస్రావం కూడా అధికంగా జరుగుతుంది. అందువల్లే దీని నుంచి బైకర్ల ప్రాణాలు కాపాడేందుకు సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చా. రక్షణ తీగ వల్ల బైకర్ల ప్రాణాలు కాపాడగలుగుతాం. ఇదే విధానాన్ని మిగతావారు కూడా అవలంబిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. దీనిని ప్రతి ఒక్కరు పాటించాలి. ముఖ్యంగా చైనా మాంజాను గాలిపటాలను ఎగరవేయడానికి ఉపయోగించకూడదు. దీనివల్ల మనుషులకే కాదు, పశువులు, పక్షులకు విపరీతమైన ప్రమాదం ఉంటుందని” గుజరాత్ పోలీసులు చెబుతున్నారు. గుజరాత్ పోలీసులు ఏర్పాటు చేస్తున్న రక్షణ తీగకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ఇదే సమయంలో చైనా నుంచి అక్రమంగా మాంజాను దిగుమతి చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
సంక్రాంతి సందర్భంగా ఎగర వేసే గాలిపటాలకు చైనా మాంజా ఉపయోగించడం వల్ల ప్రాణాలు పోతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో చైనా మాంజా నుంచి బైకర్లను రక్షించడానికి పోలీసులు వినూత్నప్రయోగం చేశారు.. ఏకంగా ఒక రక్షణ తీగను బైక్ కు ఏర్పాటు చేస్తున్నారు. #Gujarath#Chinamanja pic.twitter.com/cB5iyLN38K
— Anabothula Bhaskar (@AnabothulaB) January 8, 2025