https://oktelugu.com/

Viral Video : బాయ్‌ఫ్రెండ్‌కు ఊహించని గిఫ్ట్ పంపిన ప్రియురాలు.. ఆ గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ కావాల్సిందే!

ఓ ప్రియురాలు తన ప్రియుడికి ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. ఆ గిఫ్ట్ చూసిన ఆమె బాయ్‌ఫ్రెండ్ షాక్ అయ్యాడు. మీరు కూడా ఆ గిఫ్ట్ చూస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 26, 2024 / 02:31 AM IST

    Girl Friend to Boy Friend

    Follow us on

    Viral Video : ప్రస్తుతం చాలామంది ఆన్‌లైన్ ఆర్డర్లు పెడుతున్నారు. వాళ్లకి ఏం కావాలన్నా బయటకు వెళ్లి కొనకుండా ఇంటి దగ్గరకే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇలా స్నేహితులు, కుటుంబ సభ్యుల బర్త్‌ డేలు లేదా పెళ్లి రోజు వేడుకలు ఏవైనా సరే ఆర్డర్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేమికులు అయితే స్పెషల్ డేస్ ఉన్నా లేకపోయిన వాళ్లు ప్రేమించిన వాళ్లకు ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తారు. వాళ్లు అడిగితే ఇవ్వడం కంటే అడగకుండా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని కొందరు సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తుంటారు. దీనివల్ల ఇద్దరి మధ్య బంధం ఇంకా బలపడుతుంది. రిలేషన్‌లో కోపాలు, ప్రేమ ఎంత ముఖ్యమూ.. చిన్న గిఫ్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు, అడగకుండానే ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. అయితే తాజాగా ఓ ప్రియురాలు తన ప్రియుడికి ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. ఆ గిఫ్ట్ చూసిన ఆమె బాయ్‌ఫ్రెండ్ షాక్ అయ్యాడు. మీరు కూడా ఆ గిఫ్ట్ చూస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

    ఓ ప్రేమికుడికి తన ప్రియురాలు సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపింది. డెలివరీ బాయ్ వచ్చి తలుపు కొడతాడు. దీంతో ఆ ప్రేమికుడు బయటకు వస్తాడు. అమన్ తివారీ నువ్వేనా అని అడుగుతారు. బయటకు వచ్చి ఆ ప్రేమికుడు అవును నేనే అమన్ తివారీ అని చెబుతాడు. వెంటనే డెలివరీ బాయ్ అతన్ని గట్టిగా కొడతాడు. అలాగే తన్నుతాడు కూడా. అయితే ఆ డెలివరీ బాయ్ లెక్క పెట్టుకుని మరీ కొడతాడు. దీంతో ఆ ప్రేమికుడు ఎందుకు నన్ను కొడుతున్నావని అడగ్గా.. డెలివరీ బాయ్ చెప్పిన సమాధానం వింటే మీరు షాక్ కావల్సిందే. నీ ప్రియురాలు రెండు పంచ్‌లు, రెండు చెంప దెబ్బలు, ఒక కిక్ ఇవ్వమని ఆర్డర్ చేసింది. అందుకే నిన్ను కొట్టానని డెలివరీ బాయ్ అంటాడు. అలాగే ఓ రసీదు ఇచ్చి దానిపై ప్రియుడి సంతకం కూడా తీసుకున్నాడు. ఎందుకంటే ఆర్డర్ చేరిందో లేదో తెలుసుకోవడానికి ఆ రసీదు. ఆ తర్వాత ప్రియుడు కూడా మరి ఈ ఆర్డర్‌ను రిటర్న్ ఇవ్వచ్చా లేదా అని కూడా అడుగుతాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. అరే ఇలాంటి ఆర్డర్ కూడా ఉంటుందా అని షాక్ అవుతున్నారు. కొందరు నెటిజన్లు ఫన్నీగా కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటివి ఉంటాయనే నేను లవ్ చేయను. అవి మనకి సెట్ కావని అంటున్నారు. మరికొందరు ప్రియురాలి మనస్సును ఎందుకు ముక్కలు చేశాడు ఏమో.. ఆమె ఇలాంటి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించిందని కామెంట్లు చేస్తున్నారు. అసలు దెబ్బలు ఆర్డర్ చేయడం ఏంటి? ఈ ఆలోచననే కొత్తగా ఉందని అంటున్నారు. మరి మీకు ఏం అనిపిస్తుందో కామెంట్ చేయండి.