Girlfriend gets a shocking
Viral Video : అలాంటి ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్లో ఓ యువకుడు, యువతి అత్యంత చనువుగా ఉన్నారు. సరదాగా మాట్లాడుకుంటున్నారు. పాప్ కార్న్ (paap corn) తింటున్నారు. ఆ తర్వాత ఐస్క్రీమ్ (ice cream) లాగించారు.. అనంతరం చెరో కోక్ తాగారు. ఎన్నో రైళ్లు వెళ్ళాయి. వాళ్లు మాత్రం అక్కడే, అలానే ఉండిపోయారు. ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు.. చెవుల్లో ఏవేవో గుసగుసలు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. మెట్రో రద్దీగా ఉండడంతో వీరి పనిలో వీరున్నారు. సమీపంలో ఉన్న ఓ యువతి వీరినే గమనిస్తోంది. అదే పనిగా వీరినే చూస్తోంది. వీళ్లు మాత్రం దర్జాగా తమ పని తాము కానిస్తున్నారు. కానీ ఇంతలోనే ఆమె వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఆమె ఎంట్రీ తో ఆ అబ్బాయి ఒకసారి గా షాక్ అయ్యాడు.. ఏదో సర్ది చెప్పబోతుండగా.. ఆమె శివతాండవం వేసింది. అతడి గల్లా పట్టి నానా మాటలు అన్నది. ” నీకు బుద్ధుందా.. ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నా ఉన్నాను.. కనీసం లిఫ్ట్ చేయవు. ఒక మాట కూడా మాట్లాడవు. నీకోసం పిచ్చిదానిలా ఎదురు చూస్తుంటే నువ్వు చేస్తున్నది ఇక్కడ ఇదా? అసలు ఇదెవతి? నీకు ఎక్కడ పరిచయమైంది?” అంటూ ఆ యువతి దుర్భాషలాడింది. దీంతో ఏమైందో? ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అక్కడ ఉన్న కొంతమంది ప్రయాణికులు అక్కడికి వెళ్లారు. వారికి ఆ యువతి అసలు విషయం చెప్పేసరికి దిమ్మ తిరిగిపోయింది.
ఆమెను కాదని ఈమెను
ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్లో గొడవ చేసిన ఆ యువతి, మరో యువతి తో ఉన్న యువకుడు ప్రేమలో ఉన్నారు. ఆరోజు ఫిబ్రవరి 14 కావడంతో సరదాగా గడుపుదామని ఆ యువతి, ఆ యువకుడు ప్లాన్ చేసుకున్నారు. ఢిల్లీ మెట్రో దగ్గర కలుద్దామని అనుకున్నారు. ఆ యువతి ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నా అతడు మాత్రం ఫోన్ ఎత్తడం లేదు. వాట్సాప్ లో మెసేజ్లు పెడితే రిప్లై ఇవ్వడం లేదు. దీంతో ఢిల్లీ మెట్రో దగ్గర వెతుకుతున్న ఆమెకు అతడు కనిపించాడు. అతడి వెంట మరో యువతి ఉండడంతో ఆమె కోపం తారాస్థాయికి చేరింది. అయితే ఇన్ని సంవత్సరాలపాటు ఈమెను ప్రేమించిన అతడు.. ఇప్పుడు ఆమెను లైన్ లో పెట్టాడు. ఈమెతో ప్రేమలో ఉంటేనే.. ఆమెతో సరస సల్లాపాలు కొనసాగిస్తున్నాడు. చివరికి ఢిల్లీ మెట్రో దగ్గర దొరికిపోయాడు.. ఫిబ్రవరి 14 కాస్త.. అతని అసలు రూపాన్ని బయటపెట్టింది. అంతేకాదు సోషల్ మీడియాలో అతడి గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ప్రేమికుల రోజున తన ప్రియుడు మరో యువతితో ఉండడాన్ని చూసి ఓ యువతీ తట్టుకోలేకపోయింది. అతడి పై ఆగ్రహం వ్యక్తం చేసింది.. దుర్భాషలాడింది.. ఈ ఘటన ఢిల్లీ మెట్రో స్టేషన్ దగ్గర జరిగింది. #ValentinesDay#DelhiMetro #loveeffaire pic.twitter.com/epTtoh6xtI
— Anabothula Bhaskar (@AnabothulaB) February 16, 2025