https://oktelugu.com/

Wayanad : డబ్బున్న వాళ్లు జస్ట్ అదృష్టవంతులు.. ధనం లేకున్నా ఇతడు మాత్రం గుణవంతుడు..

అతడు ఒక చెత్త ఏరుకునే వ్యక్తి. అతడికి తోడుక్కోవడానికి సరిగా దుస్తులు కూడా లేవు. మాసిన గడ్డం, పల్చటి దేహంతో ఉన్న అతడు.. తన జేబులో ఉన్న చిల్లర తీసి వెంటనే వారికి విరాళం ఇచ్చాడు. అది ఎంత అనేది పక్కన పెడితే.. అతడి సామర్థ్యానికి అది చాలా ఎక్కువ. వందల కోట్లు ఉన్నవాళ్లు, వేల కోట్లకు అధిపతులుగా ఉన్నవాళ్లు ఒక రూపాయి కూడా వయనాడ్ కోసం విరాళం ఇవ్వని పక్షంలో

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 13, 2024 / 10:57 AM IST

    Garbage collector

    Follow us on

    Wayanad : ఎంగిలి చేత్తో కాకిని కొట్టాలి.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి. ఆపదంటూ వచ్చిన వారిని ఆదరించాలి. అప్పుడే మనిషి జన్మకు సార్ధకత. పుట్టిన పుట్టుకకు విశిష్టత లభిస్తాయి అంటారు పెద్దలు. కానీ సమాజంలో ఈ మాటలను పాటించేవారు చాలా అరుదు. లెక్కకు మిక్కిలి డబ్బు ఉన్నప్పటికీ, సిరిసంపదలతో తులతూగుతున్నప్పటికీ కొంతమంది దానం చేయడానికి ముందుకు రారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోలేరు. డాబు, దర్పాన్ని ప్రదర్శించేందుకు మాత్రం వెనుకాడరు. కానీ కొందరు ఉంటారు.. వారి వద్ద ఏం లేకపోయినప్పటికీ.. ఆర్థికంగా స్థితిమంతులు కాకపోయినప్పటికీ సమాజం కోసం ఎంతో కొంత చేస్తూ ఉంటారు. ఉడుతా భక్తిగా తమ సాయాన్ని అందిస్తూ ఉంటారు. అలాంటివారే ప్రస్తుత సమాజానికి కావాల్సింది. అలాంటి వారి వల్లే సమాజం ఎంతో కొంత బాగుపడుతుంది. ఇలాంటి సంఘటన ప్రస్తుతం వయానాడ్ లో చోటుచేసుకుంది. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది.

    వయనాడ్ ప్రాంతంలో..

    దేవుడి సొంత ప్రాంతంగా పేరు పొందిన కేరళ రాష్ట్రంలో వయనాడ్ అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి రమణీయతకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. అలాంటి ఈ ప్రాంతంలో ఇటీవల భీకరమైన వర్షాలు కురిసాయి. కొండ చరియలు విరిగిపడి అపారమైన నష్టం వాటిల్లింది. వయనాడ్ ఈ వరదల వల్ల సర్వం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈ వర్షాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఈ ప్రాంతంలో పర్యటించారు. కేంద్రం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అయితే ఈ ప్రాంతాన్ని బాగు చేసేందుకు పలువురు విరాళాలు వసూలు చేస్తున్నారు.. ఇందులో ఒక ట్రస్ట్ కూడా విరాళాలు సేకరించే బాధ్యతను భుజానికి ఎత్తుకుంది. ఈ సేకరణలో ఓ వ్యక్తి తనవంతుగా విరాళం ఇచ్చి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. శ్రీమంతుడు కాకపోయినా గుణవంతుడు అనే పేరును పొందాడు.

    ఆ ట్రస్ట్ విరాళాలు సేకరిస్తున్న క్రమంలో.. ఆ వ్యక్తి దగ్గరికి ఆ ట్రస్ట్ బాధ్యులు వచ్చారు. అతడు ఒక చెత్త ఏరుకునే వ్యక్తి. అతడికి తోడుక్కోవడానికి సరిగా దుస్తులు కూడా లేవు. మాసిన గడ్డం, పల్చటి దేహంతో ఉన్న అతడు.. తన జేబులో ఉన్న చిల్లర తీసి వెంటనే వారికి విరాళం ఇచ్చాడు. అది ఎంత అనేది పక్కన పెడితే.. అతడి సామర్థ్యానికి అది చాలా ఎక్కువ. వందల కోట్లు ఉన్నవాళ్లు, వేల కోట్లకు అధిపతులుగా ఉన్నవాళ్లు ఒక రూపాయి కూడా వయనాడ్ కోసం విరాళం ఇవ్వని పక్షంలో.. ఒక చెత్త ఏరుకునే వ్యక్తి తన వద్ద ఉన్న చిల్లరను వయనాడ్ బాధితుల కోసం ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలాంటి సమయంలోనే సమాజానికి కావాల్సింది ఇటువంటి వాళ్లే అనే భావన కలుగుతోంది.. అందుకే అంటారు.. డబ్బు ఉండగానే సరిపోదు.. దాన్ని సమాజ హితం కోసం ఇవ్వగలిగే ధైర్యం కూడా ఉండాలని.. కాగా విరాళం ఇచ్చిన వ్యక్తిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.