https://oktelugu.com/

Viral Video : వలకు చిక్కిన భారీ చేప.. భయంతో వణికిపోయిన మత్స్యకారులు.. వీడియో వైరల్

తాజాగా సముద్రంలో ప్రయాణించే కొందరు జాలర్లకు ఓ వింతైన అనుభవం ఎదురైంది. తమ వలలో ఊహించని ఓ చేప చిక్కింది. ఆ చేప పేరు ఎంటి? దాని వివరాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Written By:
  • Srinivas
  • , Updated On : October 2, 2024 / 11:42 AM IST

    Giant Sturgeon fish

    Follow us on

    Viral Video :  ప్రపంచంలో ఏమూలన ఎలాంటి వింత సంఘటనలు జరిగినా ఇప్పుడు ఇంట్లో ఉండి తెలుసుకునే రోజులు వచ్చాయి. చేతిలో మొబైల్ ఉంటే చేతిలో ప్రపంచం ఉన్నట్లే. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఎలాంటి సంఘటనలు అయినా వెంటనే వీడియో తీసి అందులో పెడుతున్నారు. ముఖ్యంగా వింత సంఘటనలు, వింత ఆకారాలు, వింత జంతువుల వీడియోలో అప్లోడ్ చేయడం వల్ల చాలా మంది ఆసక్తిగా చూస్తుంటారు. ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. సముద్రంపై ప్రయాణం చేసేవారు చాలా తక్కువ. అందువల్ల సముద్రం గురంచి ఏదైనా విషయం జరిగితే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. తాజాగా సముద్రంలో ప్రయాణించే కొందరు జాలర్లకు ఓ వింతైన అనుభవం ఎదురైంది. తమ వలలో ఊహించని ఓ చేప చిక్కింది. ఆ చేప పేరు ఎంటి? దాని వివరాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీలోకి వెళ్లండి..

    తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో నీళ్లలో ఓ వింత ఆకారం కనిపిస్తుంది. అయితే నీటిలో ఉండడం వల్ల ఇదే మునిగిపోయిన పడవ కావొచ్చు అని అనుకుంటారు. కానీ ఇది భారీ సైజులో ఉన్న ఓ చేప. చేపల కోసం మత్స్యకారులు వెళ్లగా వారికి ఇది కనిపించింది. దీనిని పట్టుకొని దానిని పరిశీలించారు. ఆ చేపను గుర్తించారు. కెనడాలో జరిగిన ఈ సంఘటన గురించి కొందరు వీడియో తీసి సోషల్ మీడియిలో పెట్టగా ఇప్పుడ దానిని ఆసక్తిగా చూస్తున్నారు.

    కెనడాలోని కొందరు జాలర్లు ఎప్పటిలాగే చేపట వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారికి నీళ్లలో భారీ ఆకారం కనిపించింది. మొదట దీనిని చూసి భయపడినట్లు వారు పేర్కొన్నారు. ఆ తరువాత వారు గాలం వేయగా వారి వలలో ఈ చేప చిక్కింది. అయితే దీనిని చూసిన మత్స్యకారులు భయంతో వణికిపోయారు. ఆ తరువాత దీనిని కొందరు పరిశోధలకు పరిశీలించగా.. దీని గురించి తెలిసింది.

    దీనిని స్టర్జన్ చేప అని అంటారు. ఇది ఎక్కువగా కెనడా ప్రాంతంలోని సముద్రంలో కనిపిస్తుంది. ఈ చేప 120 అడుగుల పొడవు ఉంటుంది. అంతేకాకుండా ఇది అత్యంత ఎక్కువగా 150 సంవత్సాలు బతుకుతుంది. టన్ను బరువు ఉండే ఈ చేపలు చాలా పురాతనమైనవని గుర్తించారు. వీటి ప్రస్థానం 200 మిలియన్ సంవత్సరాల కిందటే ప్రారంభమైంది. ఇవి ఎక్కువగా ఉత్తర అర్ధగోళంలో ఉన్న నదులు, సరస్సుల్లో కనిపిస్తాయి.

    తాజాగా కెనడా జాలర్లకు ఇది చిక్కింది. ఇప్పటి వరకు చూడని విధంగా ఉన్న ఈ చేపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. అంతేకాకుండా దీని గురించి చాలా మంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ భాగం సముద్రం ఉంటుంది. దీంతో ఇందులో వింతైన చేపలు, జలచరాలు ఉంటాయి. మత్స్యకారులు వేటకువ వెళ్లినా లేదా కొందరు పరిశోధకులు సముద్ర భూభాగంలోకి వెళ్లిన సందర్భంలో ఇలాంటివి బయటపడుతూ ఉంటాయి. అయితే అన్ని రకాల చేపలు తినడానికి అనుకూలంగా ఉండవు. కొన్ని ఎక్కువ విషపూరితమై ఉంటాయి.