https://oktelugu.com/

Viral Video : బిస్కెట్ కోసం కోతితో ఫైటింగ్.. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోను చూడాల్సిందే

వైరల్ అవుతున్న ఈ వీడియో జూలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ బోనులో బంధించినటువంటి కోతి దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు. అయితే మరుక్షణంలో చోటు చేసుకున్న సంఘటనతో చూసిన వారు ఒక్కసారిగా కడుపుబ్బా నవ్వుకున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : November 19, 2024 / 09:46 PM IST
    Viral Video

    Viral Video

    Follow us on

    Viral Video : సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మానవుల పూర్వీకులుగా భావిస్తున్న కోతుల వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తాయి. కోతులకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిని చూసి ఆశ్చర్యపోవడం సహజం. ఈ క్రమంలో కోతుల గుంపు బిస్కెట్ల ప్యాకెట్ ను దొంగిలించేందుకు ప్రయత్నించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ  ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇందులో బిస్కెట్ ప్యాకెట్ విషయంలో ఒక వ్యక్తి , కోతికి మధ్య గొడవ జరిగింది. ఈ వీడియోలో వీరిద్దరి స్పీడ్, తెలివితేటలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. ప్రజలు ఈ వీడియో పై ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే వైరల్‌గా మారుతున్న ఈ వీడియో ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

    వైరల్ అవుతున్న ఈ వీడియో జూలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ బోనులో బంధించినటువంటి కోతి దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు. అయితే మరుక్షణంలో చోటు చేసుకున్న సంఘటనతో చూసిన వారు ఒక్కసారిగా కడుపుబ్బా నవ్వుకున్నారు. కోతి, వ్యక్తి ఇద్దరూ బిస్కెట్ ప్యాకెట్ లాక్కోవడం స్టార్ట్ చేశారు. ఈ సమయంలో ఇద్దరూ ప్యాకెట్‌ను ఒకరి నుంచి ఒకరు క్షణకాలంలో లాక్కున్నారు. మనిషితో సమానంగా కోతి బిస్కెట్ ప్యాకెట్ ను తీసుకునే స్పీడ్ జనాలను ఎంతగానో ఆసక్తిని కలిగించింది. ఇలా ఇద్దరి మధ్య రెండు మూడు సార్లు జరిగింది. అయితే ఇద్దరూ ప్యాకెట్ పట్టుకున్న వేగం చూడాలి. చివరగా కోతి మెరుపు వేగంతో బిస్కెట్ ప్యాకెట్ ని   తీసుకుని నోట్లో పెట్టుకుని ఇప్పుడు తీసుకో అన్నట్లు మనిషి వైపు చూసింది. ఆ సమయంలో కోతి చర్య చూడాలి.
    asemone_abii8881 అనే ఖాతా ద్వారా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి ఇప్పటివరకు 40 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా యూజర్లు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఒక నెటిజన్ దీనిని ‘చేతి వేగం పోటీ’ అని కామెంట్ చేస్తున్నారు, మరొకరు – ‘వేగం ముఖ్యం సోదరా’ అని కామెంట్ చేశారు. కొంతమంది వినియోగదారులు దీనిని ‘హ్యాకర్ VS హ్యాకర్’ ఫన్నీ వెర్షన్ అని కూడా కామెంట్ చేశారు.

    వీడియో వేగంగా వైరల్ అవుతుంది.  ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ప్రజలు కోతి తెలివి, మానవుడి తెలివి గురించి చాలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని చూసిన యూజర్లు నవ్వుతూ, జోకులు వేస్తూ, వీడియోపై చాలా రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది, ప్రజలు దీన్ని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. షేర్ చేస్తున్నారు. వైరల్ వీడియోలో కోతి తెలివితేటలు అందరి హృదయాలను గెలుచుకున్నాయి.