Viral Video : ఒకప్పుడు పాత సంవత్సరానికి వీడ్కోలు.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే తీరు వేరే విధంగా ఉండేది. ఇళ్ళ ముందు నూతన సంవత్సర సందర్భంగా రంగవల్లులు వేసేవాళ్ళు. గ్రీటింగ్ కార్డులు పంచుకునేవాళ్లు. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకునేవాళ్లు. కానీ కాలం మారుతున్నా కొద్దీ.. మనుషుల వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే తీరు కూడా మారింది. ఆర్థిక స్థిరత్వం పెరగడం.. జీవితమంటే ఆస్వాదించడం మాత్రమే అనే ఆలోచన పుట్టడంతో.. చాలామంది నూతన సంవత్సరాన్ని విభిన్నంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో గడిచిన ఏడాదికి వీడ్కోలు పలకడాన్ని కూడా ఆడంబరంగా జరుపుకోవడం ప్రారంభించారు. ఇందులో మద్యం, విందు, వినోదాలకు పెద్దపీట వేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. విందు వినోదాల వరకు పెద్దగా ఇబ్బంది ఉండకపోయినా.. అందులో మద్యం తాగడం అనేది స్టేటస్ సింబల్ గా మారిపోయింది. రాను రాను మద్యం తాగితేనే.. ఆ మత్తులో ఎగిరితేనే పాత సంవత్సరానికి వీడ్కోలు పలకడం.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం.. వంటిదిగా మారిపోయింది. అందువల్లే నో దారు(మద్యం) దావత్” అనే ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.
ఇలాంటిదే మీకూ ఎదురయిందా..
నూతన సంవత్సరం వచ్చిందంటే ఎక్కడా లేని సంబరం ఉంటుంది. అయితే పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయంలో మద్యం తాగడం ఇటీవల పెరిగిపోయింది. అయితే దీనిని వెరైటీగా చూపించడానికి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ లు పోటీ పడుతున్నారు. అందులో ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ కనిపిస్తోంది.. ఆ వీడియో ప్రకారం.. 31 నైట్ స్నేహితులతో పార్టీకి వెళ్లడానికి ఓ భర్త సిద్ధమవుతాడు. అయితే అతడిని పంపించడానికి భార్య ఒప్పుకోదు. అతడిని అలాగే పట్టుకుంటుంది. అయితే ఆ వ్యక్తి స్నేహితుడు ఇంద్ర సినిమా డైలాగ్ అందుకుంటాడు.. “వాడు రాడు” అని ఆ వ్యక్తి భార్య అంటే..”వస్తాడు.. కచ్చితంగా వస్తాడు.. ముహూర్తం సమయానికి రాకపోతే ముక్కోటి దేవతల సాక్షిగా ముక్కలు ముక్కలుగా *** తీసుకెళ్తాను” అంటూ ఆ వ్యక్తి స్నేహితుడు చెబుతాడు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చాలామంది ఈ వీడియోను తమ వాట్సప్ స్టేటస్ గా పెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో ఇలాంటి పరిస్థితి మీకు ఎదురవుతోందా? 31 నైట్ ఎంజాయ్ చేయకుండా కట్టుబాట్లు ఉన్నాయా.. అలాంటి వాళ్లకు ఈ వీడియో అంకితం అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి భార్య ఉంటే.. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉంటుందని.. అందువల్లే వేరే ఏదైనా సాకు చెప్పి 31 పార్టీ ఎంజాయ్ చేయాలని సూచిస్తున్నారు.