Viral video : మీ బాబు ‘జోకుడు’ సల్లగుండా.. చంద్రబాబేంటి.. ఒలంపిక్స్ గోల్డ్ మెడల్ కొట్టడం ఏంటి?

ప్రస్తుతం ఒలింపిక్స్ ముగింపు దశకు చేరుకున్నాయి. భారత్ ఆరు మెడల్స్ సాధించింది. నేపథ్యంలో ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ లో చర్చా వేదిక మొదలైంది. ఇందులో పాల్గొన్న ఓ వ్యక్తి.. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు.." చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి సరిపోయింది.. ఒకవేళ ఆయన క్రీడారంగంలోకి వెళ్లి ఉంటే ఖచ్చితంగా ఒలింపిక్స్ లో భారత్ కు మూడు మెడల్స్ తెచ్చేవారని" ఆయన వ్యాఖ్యానించారు

Written By: Anabothula Bhaskar, Updated On : August 12, 2024 1:48 pm

Chandrababu

Follow us on

Viral video: మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం కదా.. మీడియా అనేది వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించాలి. సమాజంలో సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి. వాటి పరిష్కార బాధ్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అంతేగాని వ్యక్తులకు గులాం గిరి చేయకూడదు. నాయకులకు భజన చేయకూడదు. స్వతంత్రంగా ఉండాలి. ప్రతిపత్తిని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో తన వంతు పాత్రను పోషించాలి. కానీ తెలుగు నాట మీడియా పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. నచ్చినవారికి పల్లకి సేవ చేయడం, నచ్చని వారిపై బురద చల్లడం వంటి పనులను పరిపాటిగా మార్చుకుంది. అడ్డగోలుగా నిరాధార వార్తలను ప్రసారం చేయడం.. ఆపై వాక్ స్వాతంత్రాన్ని అణగదొక్కుతున్నారని ప్రచారం చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇదే సమయంలో మీడియా భజన కూడా పెరిగిపోయింది. అయితే ఆ భజనలో ఒక్కో ఛానల్ ఒక్క విధంగా ఆరితేరిపోయింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో చంద్రబాబు నాయుడిని స్తుతిస్తూ చేస్తున్న భజన కార్యక్రమం అహో ఓహో అనేలా చేస్తోంది.

సహజంగానే ఇలాంటి వాటిని వైసిపి సోషల్ మీడియా విభాగం వారు తెరపైకి తీసుకొస్తారు. వాటికి అనుగుణంగానే గత వీడియోలను జత చేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు. ప్రస్తుతం ఒలింపిక్స్ ముగింపు దశకు చేరుకున్నాయి. భారత్ ఆరు మెడల్స్ సాధించింది. నేపథ్యంలో ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ లో చర్చా వేదిక మొదలైంది. ఇందులో పాల్గొన్న ఓ వ్యక్తి.. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు..” చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి సరిపోయింది.. ఒకవేళ ఆయన క్రీడారంగంలోకి వెళ్లి ఉంటే ఖచ్చితంగా ఒలింపిక్స్ లో భారత్ కు మూడు మెడల్స్ తెచ్చేవారని” ఆయన వ్యాఖ్యానించారు. దీనికి ఆ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ప్రజెంటర్ అవాక్కయ్యారు. ఏంటి ఇలా కూడా జరుగుతుందా అంటూ ముఖంలో ఆశ్చర్యకరమైన హావభావాలను పలికించారు..

ఇదే సమయంలో గతంలో ప్రో కబడ్డీ లీగ్ ఆంధ్రాలో జరిగినప్పుడు.. ఆంధ్రాలో తాను త్వరలో ఒలింపిక్స్ నిర్వహిస్తానని చంద్రబాబు ప్రకటించిన మాటలను ఈ వీడియోకు జత చేశారు. ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన ఆటగాళ్లకు నోబెల్ బహుమతి ఇస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలను కూడా ఈ వీడియోకు యాడ్ చేశారు. దీంతో ఆ వీడియో చూసేందుకు నవ్వులు పూయించే విధంగా ఉంది. దీనిపై టిడిపి నాయకులు స్పందిస్తున్నారు..”ఇలాంటి వీడియోలు చేసి శునకానందం తప్ప మీరు పొందేది ఏముంది.. ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి. అయినా కూడా మీకు బుద్ధి రాకపోతే ఎలా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ” చంద్రబాబు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తోంది కొన్ని నెలల నుంచే. అప్పటికే ఏదో జరిగిపోయినట్టు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటూ” టిడిపి సోషల్ మీడియా విభాగం నాయకులు వైసిపి సోషల్ మీడియా విభాగాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబుపై వైసీపీ సోషల్ మీడియా విభాగం రూపొందించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ సర్కులేట్ అవుతోంది.