Viral Video : పెళ్లి ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుక. కొంద మంది రెండు మూడు చేసుకుంటారనుకోండి అది వేరు. కానీ తొలిసారి పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చిరకాలం గుర్తుండిపోతుంది. అలా గుర్తుండిపోయేలా జరుపుకుంటారు కూడా. నేడు ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో పెళ్లి వేడుకల్లోనూ మార్పులు వచ్చాయి. నిశ్చితార్థంతోపాటు, ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఆటలు, పాటలు, డ్యాన్స్ షోలు, డాన్స్ ప్రాక్టీస్ ఇలా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకల్లో బంధువులతోపాటు వధూవరులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో వరుడి మరదలు బావతో ఆడిన సరసాల వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
ఏం జరిగిందంటే..
ఓ పెళ్లి వేడుకలో వధువు సోదరి ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది. ఆ సమయంలో ఆమె వరుడితో ప్రవర్తించిన తీరు అక్కడున్నవారినే కాదు.. పెళ్లి కూతురు కూడా బిత్తరపోయేలా చేసింది. anmol.hameed అనే ఇన్‌స్టాగ్రామ్‌లో దీనిని పోస్టు చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. పెళ్లి జరుగుతోంది. వధూవరులు వేదికపై సోఫాలో కూర్చున్నారు. ఆ సమయంలో వధువు సోదరి డాన్స్ మొదలు పెట్టింది. బాలీవుడ్ హిట్ సాంగ్ వో జింకే ఆగేజీ.. వో జింకే పేచే జీ.. సాంగ్‌కు స్టెప్పులేసింది. ఈ సమయంలో ఆమె వరుడితో హద్దుమీరి ప్రవర్తించింది. ఈ దృశ్యాలు చూసి వధవు కూడా బిత్తర పోయింది. కానీ అందరి ముందే ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది.
నెటిజన్ల ఆగ్రహం..
ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంని అంటుంటే.. మరికొందరు. మరదలి ఓవరాక్షన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లకు హద్దులు ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి అమ్మాయిల కారణంగానే సమాజం చెడిపోతోంది అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.