Eating chapatis at roadside restaurants
Viral Video: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బయటి ఫుడ్ తినేందుకు అలవాటు పడిపోయారు. ప్రస్తుతం బిజీబిజీ గజిబిజి జీవితం అయిపోయింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లో వండుకునే తీరికలేకుండా పోయింది. దీంతో బయట ఫుడ్ తినడానికే అలవాటు పడిపోయారు. బయటి ఫుడ్ తినడం ఆరోగ్యానికి హానికరం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా మనలో చాలా మంది వంట చేసుకునే తీరిక లేకనో.. టేస్ట్ కోసమో బయట దొరికే ఆహారాన్ని తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంత మంది నిర్వాహకులు వంట చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ప్రజల ప్రాణాలు ఏమైపోతే మాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ దేనికి సంబంధించిన వీడియో.. అందులో ఏముందో తెలుసుకుందాం.
ఓ వ్యక్తి రోడ్డు పక్కన దాబాలో చపాతీ చేసేందుకు పిండిని కలుపుతున్నాడు. అదే దాబాలో కొంచెం దూరంలో మరో వైపు కస్టమర్లు భోజనం చేస్తున్నారు. మరో వైపు ఓ గోడ పక్కన అపరిశుభ్ర వాతావరణంలో పిండిని పిసుకుతున్నాడు. పెద్ద పాత్రలో పిండి వేసి, అపరిశుభ్ర చేతులతో దాన్ని అటూ ఇటూ కలుపుతున్నాడు. మధ్యలో అక్కడే అవి ఏ నీళ్లో తెలియదు కానీ మగ్గుతో పిండిలో నీటిని పోస్తున్నాడు. అయితే ఆ మగ్ అపరిశుభ్రంగా ఉంది. అలా పిసికిన పిండిని టేబుల్‌పై వేసి, ఓ మాసిన బట్టను దానిపై కప్పేశాడు. వీడియో తీస్తున్న వ్యక్తి అతడి వద్దకు వెళ్లి.. చపాతీ పిండి రెడీ చేస్తున్న పద్ధతిపై ఆరా తీశాడు. ఇందుకు అతను కాసేపు మౌనంగా ఉండి.. తర్వాత సమాధానం చెప్పకుండా వెళ్లిపోతాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెట్టింట్లో వేగంగా షేర్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మనం ఇంతకు ముందు తిన్న హోటల్స్ లో కూడా పరిస్థితి ఇలాగే ఉండి ఉంటుంది కదా అని షాక్ అవుతున్నారు. మరీ ఇంత దారుణామా.. ప్రజల ఆరోగ్యం ఏమై పోయినా పర్లేదు కానీ డబ్బులు వస్తే చాలా అంటూ మండిపడుతున్నారు. ఇంకోసారి ఇలాంటి రెస్టారెంట్లలో చపాతీ తినాలంటే భయపడే పరిస్థితి వచ్చిందంటూ మరో నెటిజన్ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.