https://oktelugu.com/

Viral Video : పులితోనే వేట.. పిల్ల ఎలుగు కోసం తల్లి చేసిన పోరాటం.. వైరల్ వీడియో

పిల్లల కోసం తల్లి ఎంతటి త్యాగానికైనా వెనుకాడదు. పిల్లలను రక్షించుకోవడానికి తన ప్రాణాలను కూడా అడ్డు పెడుతుంది. ఇది కేవలం మనుషుల్లోనే కాదు అన్ని జీవుల్లోనూ కనిపిస్తుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 29, 2024 / 12:22 PM IST

    Viral video

    Follow us on

    Viral Video :  సృష్టిలో వెలకట్టలేనిది తల్లి ప్రేమ. పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడదు. అవసరమైతే తన ప్రాణాలను కూడా ఇస్తుంది. కోడి పిల్లలను తన్నుకుపోవడానికి వచ్చే గద్దను తల్లి కోడి తరిమి తరిమి కొడుతుంది. గుడ్లను తినేందుకు గూట్లోకి చొరబడే పాములను పక్షలు కాళ్లతో రక్కుతూ తరిమి కొడతాయి. ఇక జంతువులు కూడా తమ పిల్లల కోసం బలవంతమైన శత్రువలతోనూ తలపడతాయి. గెలుపోటములను అటు ఉంచి.. పిల్లల కోసం చివరి వరకూ పోరాడడమే తల్లి నైజం. ఇక పిల్లల కోసం పక్షులు, జంతువులు చేసే పోటారానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఈ వీడియోలు చూసేవారంతా తల్లి గెలవాలనే కాంక్షిస్తారు. పిల్ల​ప్రాణాలు దక్కాలనుకుంటారు. తాజాగా తన పిల్ల కోసం ఎలుగు బంటి పెద్దపులితో పోరాడి తరిమి కొట్టిన వీడియో వైరల్‌గా మారింది.

    ఇన్‌స్టాలో ఎలుగు ఫైటింగ్‌ వీడియో..
    ఎగులుబంటి తన కూనను కాపాడుకునేందుకు పెద్దపులితో పోరాటం చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతోంది. థింక్‌లైట్‌ జల్పా(thinklite_jalpa) అకౌంట్‌ నుంచి దీనిని పోస్టు చేశారు. మహరాష్ట్రలోని తడోబా అందేరి టైగర్‌ రిజర్వు ఫారెస్టులో నివసించే ఓ ఎలుగుబంటి తన పిల్లలతో తిరుగుతండగా ఒక్కసారిగా పెద్దపులి ఓ కూనపై దాడిచేసింది. దీంతో తన పిల్లలను కాఆపడుకునేందుకు తల్లి ఎలుగు ప్రాణాలకు తెగించింది. ఏకంగా పులిని బెదిరించడమే కాకుండా.. తరిమికొట్టింది. తల్లి ఎలుగు వీరోచిత పోరాటానికి పులి తోక ముడిచింది. అక్కడి నుంచి పారిపోయింది. దీనిని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తల్లి పిల్లల కోసం ఎంత ధైర్యం ప్రదర్శించిందో కదా అంటూ ప్రశంసిస్తున్నారు. తల్లులు పిల్లలను కాపాడుకోవడానికి ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొంటారు అని కామెంట్‌ చేస్తున్నారు.

    తడోబాలో పర్యాటకులకు అనుమతి..
    ఇదిలా ఉంటే తడోబా రిజర్వు ఫారెస్టులోకి పర్యాటకులను అనుమతిస్తారు. పూర్తి సెక్యూరిటీ ఉన్న వాహనాల్లో వన్యప్రాణులను దగ్గరి నుంచి చూడవచ్చు. ఫొటోలు తీసుకోవచ్చు. అయితే వాహనం వెంట సెక్యూరిటీ కూడా ఉంటారు. శీతాకాలంలో, వేసవిలో ఎక్కువ మంది తడోబా అడవుల్లో పర్యటనకు వెళ్తుంటారు. పులులు, ఇతర వన్య​‍ప్రాణులను దగ్గరి నుంచి చూస్తారు. తమ కెమెరాల్లో బంధిస్తారు. ఇలాగే ఓ పర్యాటకురాలు ఎలుగుబంటి పులి ఫైటింగ్‌ వీడియోను చిత్రీకరించారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.