Abishakam: భక్తి పలు విధాలు. ఒక్కొక్కరు ఒక్కోలా తమ భక్తిని ప్రదర్శిస్తారు. వారు చేసే పనిలో తప్పును వెతికేకంటే భక్తినే చూడాలని వారు కోరుకుంటారు. ఉదాహరణకు పురాణాలను తీసుకోండి. గొప్ప శివ భక్తుడైన కన్నప్ప శివుడికి నైవేద్యంగా మాంసం పెడతాడు. పైగా శివలింగం రోధిస్తుందని తన కళ్లను తీసి పెడతాడు ఇది అతని భక్తి. అలాగే ఏకలవ్యుడిని తీసుకుంటే.. గురువు ద్రోణాచార్యుడి విగ్రహం ఏర్పాటు చేసి విలువిద్య నేర్చుకొని గురు దక్షిణగా బొటన వేలు ఇస్తాడు. ఇలా భక్తి పరిపరివిధాలు. ఇవన్నీ గత కాలాలు.. ఈ కాలంలో కూడా వారి భక్తిని వివిధ రూపాలుగా చూపుతున్నారు. ప్రముఖ బోధకుడు ఆచార్య కౌశిక్ మహరాజ్ మథురలోని రైల్వే ట్రాక్ పై శివలింగానికి జలదీక్ష (జలాభిషేకం) చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలతో వైరల్ గా మారింది. శివుడు బోళా శంకరుడు. అడిగిన వారికి అడిగిన వెంటనే వరాలు ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివుడిని ఆరాధించేందుకు అనేక పద్ధతులు ఉన్నాయి. ఆయన లయకారుడు కాబట్టి శ్మశానంలో ఉంటాడు. కాలిన శవాల భూడిద రాసుకుంటాడు. అలా కొందరు శివుడిని కొలుస్తారు. వారిని అఘోరాలు అని కూడా పిలుస్తారు.
అయితే, ప్రముఖ బోధకుడు ఆచార్య కౌశిక్ మహరాజ్ మథురలోని రైల్వే ట్రాక్ పై శివలింగాన్ని ఉంచి రైల్వే వారు పైపుల ద్వారా సరఫరా చేస్తున్న జలంతో అభిషేకం చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. మురికిగా ఉండే రైల్వే పట్టాలపై శివలింగాన్ని ఉంచడం అగౌరపరచడమేనని కొందరు అన్నారు. ఈ చర్చ పూజ్య సాధువు గౌరవాన్ని తగ్గిస్తుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిక్రమ మార్గ్ సమీపంలోని తులసీ వ్యాన్ లో చిత్రీకరించిన ఈ వీడియో ఇలాంటి చర్యల సముచితతపై సమాజంలో చర్చలను రేకెత్తించింది.
ఈ ఫుటేజీ చాలా సంవత్సరాల క్రితం నాటిదని ఆశ్రమం చెబుతుండగా, ఆచార్య కౌశిక్ సోదరుడు రాందేవ్ శాస్త్రి ఈ ఘటన పొరపాటు అని, కొంత మంది వ్యక్తులు పాత వీడియోను ప్రసారం చేయడం ద్వారా తన సోదరుడి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆచార్య కౌశిక్ మహరాజ్ రైల్వే ట్రాక్ పై పూజలు చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది.
ఏది ఏమైనా ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కాకుండా ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బయటకు వచ్చాక తప్పులు సరిదిద్దుకునేందుకు పాతదని కవర్ చేస్తున్నారని అనే వారి సంఖ్య లేకపోలేదు.
( पूराण मनीषी) श्री आचार्य कौशिक जी महाराज
आपसे सवाल आप इस पूजा से सहमत हैं हां/ नहीं
जनता और आप सब इस पूजा से कौन कौन सहमत हैं
भगवान शिव जी को इस तरह से रेलवे लाइन➖ पर रखने का इनको अधिकार है
क्या इन्होंने सनातन धर्म का अपमान नहीं किया? pic.twitter.com/H2vO8gwptD— आचार्य भरत तिवारी जी RSP संगठन मंत्री (@AcharyaBharatJi) October 31, 2024